జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించండి: అరుణ్ జైట్లీకి లేఖ రాసిన జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. చేనేతను జీఎస్టీ నుంచి మినహాయించాలని ఆయన తన లే
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. చేనేతను జీఎస్టీ నుంచి మినహాయించాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
చదవండి: పవన్ కల్యాణ్ పార్టీలోకి రోజా!? సర్వే ప్రభావం, జగన్ తో అంతరం, నాగబాబు సహకారం!
వైఎస్ జగన్ లేఖను ఆ పార్టీ చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం విజయవాడలో మీడియాకు విడుదల చేశారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ వస్త్రాలకు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) నుంచి మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ తన లేఖలో కోరారు.

మన దేశంలో వ్యవసాయం రంగం తర్వాత చేనేత రంగంపైనే ఎక్కువ మంది ఆధారపడ్డారని అన్నారు. టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా నాలుగున్నర కోట్లు, పరోక్షంగా ఆరు కోట్లమంది ఉపాధి పొందుతున్నారన్నారు.
చేనేత రంగంపై జీఎస్టీ భారం వేస్తే ... ఆ ప్రభావం వీరందరిపై పడుతుందన్నారు. జీఎస్టీ వల్ల వస్త్ర దుకాణాలు మూసేయాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాపారుల్లో ఆందోళన నెలకొందన్నారు. కేవలం మూడు, నాలుగు శాతం లాభాలతో అమ్ముకునే వ్యాపారులకు జీఎస్టీ వల్ల అధిక శాతం పన్ను పడుతోందన్నారు.
పెరిగిన రసాయనాలు, నూలు ధరలతో ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న చేనేత రంగం జీఎస్టీ పన్నులతో పూర్తిగా కనుమరుగు అవుతుందన్నారు. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తే ఉత్పత్తులు మరింత పెరిగే వీలుందని, కార్మికులకు ఊరట కలుగుతుందని వైఎస్ జగన్ తన లేఖలో నివేదించారు.












Click it and Unblock the Notifications