Godavari: భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. మూడో ప్రమాదకర హెచ్చరిక జారీ..

తెలంగాణలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. అక్కడ ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పై నుంచి వస్తున్న భారీ వరదలతో శుక్రవారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 53.09 అడుగలకు చేరింది. గోదావరి ప్రవాహం 14.32 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఆ తర్వాత కూడా వరద ఉధృతి పెరిగింది. శనివారం ఉదయం కల్లా నీటిమట్టం 54.3 అడుగులకు పెరిగింది. 8 గంటల వరకు ఇదే వరద నిలకడగా ఉంది. పైన మహారాష్ట్ర చత్తీస్ ఘడ్ నుంచి భారీగా వరద వస్తుంది. ఏటూరునాగారం, పేరూరు నుంచి వరద వరద ఉందని.. గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి నీటిమట్టం పెరిగితే.. పరీవాహక ప్రాంతాలు నీట మునుగుతాయి.

Godavari is flowing heavily at Bhadrachalam

దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను శుక్రవారం రాత్రి 8 గంటల లోపు తరలించారు. ఇప్పటి వరకు 11,505 మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అక్కడే ఉండి గోదావరి వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అత్యవసరమైతే హెలికాప్టర్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు.

భారీ వర్షాలతో గోదావరి పరిధిలోని ప్రాజెక్టులు నిండాయ. సింగూరు మినహా నిజాంసాగర్‌, శ్రీరామసాగర్‌, కడెం, ఎల్లంపల్లి, దిగువమానేరు, సుందిళ్ల (పార్వతి), అన్నారం (సరస్వతి), మేడిగడ్డ (లక్ష్మి) ఇలా అన్ని బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+