బంగారం లాంటి వార్త; దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో బంగారం ఏటీఎంలు; పండుగ చేస్కోండిక!!

బంగారాన్ని కొనుగోలు చేసి పండగ చేసుకోవాలనుకునే వారికి బంగారం లాంటి వార్త చెప్పింది గోల్డ్ సిక్కా సంస్థ. భారతదేశంలో మొదటిసారిగా హైదరాబాద్ బంగారం ఏటీఎంలకు వేదిక కానుంది. హైదరాబాద్లో ఇకనుండి బంగారం ఏటీఎంలు ఏర్పాటు కానున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులతో బంగారం కొనుగోలుకు ఈజీ మార్గాన్ని తెచ్చింది గోల్డ్ సిక్కా సంస్థ.

హైదరాబాద్ లో తొలిసారిగా బంగారం ఏటీఎంలు.. మూడు చోట్ల ఏర్పాటు

హైదరాబాద్ లో తొలిసారిగా బంగారం ఏటీఎంలు.. మూడు చోట్ల ఏర్పాటు


హైదరాబాదీలు త్వరలో ఏటీఎంల ద్వారా బంగారం కొనుగోలు చేయవచ్చు. గోల్డ్‌ని కొనుగోలు చేసే వర్గాన్ని ప్రోత్సహించేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్న గోల్డ్‌సిక్కా, త్వరలో గుల్జార్ హౌజ్, అబిడ్స్ మరియు సికింద్రాబాద్‌లలో ఈ గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేసి, ఇక్కడ వచ్చే రెస్పాన్స్ ను బట్టి దేశవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తోంది.

అరా గ్రాము నుండి 100 గ్రాముల బార్ ల వరకు ఏటీఎంలలో

అరా గ్రాము నుండి 100 గ్రాముల బార్ ల వరకు ఏటీఎంలలో


బంగారం ఏటీఎంలు వినియోగదారులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అనుమతిస్తాయి. ఇది స్వచ్ఛత మరియు బరువును ధృవీకరిస్తూ పత్రాలను కూడా జారీ చేస్తాయి. అరగ్రాము నాణేల నుండి 100 గ్రాముల బార్‌ల వరకు బంగారం ఏటీఎంలలో లభిస్తాయి. ఏటీఎంల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రీపెయిడ్ కార్డులను అందించాలని కంపెనీ యోచిస్తోంది. తర్వాత, కొనుగోళ్లు చేయడానికి వివిధ బ్యాంక్ కార్డులను అనుసంధానం చేస్తుంది అని గోల్డ్‌సిక్కా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ప్రమోటర్ సయ్యద్ తరుజ్ తెలిపారు.

 ఏటీఎం నుంచి వచ్చే బంగారు నాణేలు, కడ్డీలపై స్వచ్ఛత సర్టిఫికెట్‌తోపాటు బరువు కూడా

ఏటీఎం నుంచి వచ్చే బంగారు నాణేలు, కడ్డీలపై స్వచ్ఛత సర్టిఫికెట్‌తోపాటు బరువు కూడా


గోల్డ్‌సిక్కా చెన్నైకి చెందిన ట్రూనిక్స్ డేటావేర్ ఎల్‌ఎల్‌పితో చేతులు కలిపింది. ఇది వివిధ రంగాలకు ఆర్థిక మరియు బ్యాంకింగ్ అవసరాలకు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులకు సురక్షితమైన ప్రింట్ ఉత్పత్తులు మరియు స్మార్ట్ సొల్యూషన్‌లను అందించే కె.ఎల్ హైటెక్ సెక్యూర్ ప్రింట్‌తో కూడా చేతులు కలిపింది. ఏటీఎం నుంచి వచ్చే బంగారు నాణేలు, కడ్డీలపై స్వచ్ఛత సర్టిఫికెట్‌తోపాటు బరువు కూడా ఉంటాయని సంస్థ పేర్కొంది.

 బంగారాన్ని ఆస్తిగా .. కొనుగోలు ఈజీగా.. అందుకే ఈ ప్లాన్

బంగారాన్ని ఆస్తిగా .. కొనుగోలు ఈజీగా.. అందుకే ఈ ప్లాన్


చాలా మంది వ్యక్తులు బంగారాన్ని కూడా ఆస్తిగా భావిస్తూ కొనుగోలు చేస్తున్నారు . అయితే వారంతా మార్కెట్‌ను సందర్శించడం చాలా సమయం తీసుకునే ప్రక్రియ కాబట్టి , వారికోసం సులువుగా బంగారాన్ని అందించటం కోసం ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మేము ఓవర్‌హెడ్ ఖర్చులను తగ్గించుకుంటాము కాబట్టి మేము ఉత్తమ ధరకు బంగారాన్ని అందించడానికి ప్రయత్నిస్తామని గోల్డ్ సిక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయ్యద్ తరుజ్ పేర్కొన్నారు.

 ఒక్కో ఏటీఎంలలో ఐదు కిలోల బంగారం .. కొనుగోలుకు షరతులు వర్తిస్తాయి

ఒక్కో ఏటీఎంలలో ఐదు కిలోల బంగారం .. కొనుగోలుకు షరతులు వర్తిస్తాయి

ఒక్కో బంగారం ఏటీఎంలో దాదాపు ఐదు కిలోల బంగారం ఉంటుందని, దీనిని పరిరక్షించటం కోసం అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి బయట అమలులో ఉన్న షరతులన్నీ ఇక్కడ వర్తిస్తాయని పేర్కొన్నారు. రూ. రెండు లక్షల కంటే ఎక్కువ కొనుగోళ్లకు పూర్తి కేవైసి అవసరం అని వెల్లడించారు. ఏటీఎం ల ద్వారా జరిగే అన్ని విక్రయాలకు ఓటిపితో సహా రెండు-కారకాల ప్రమాణీకరణ ఉంటుందని తెలిపారు. అది నమోదిత మొబైల్ నంబర్‌లకు పంపబడుతుందని పేర్కొన్నారు.

బంగారం ఏటీఎంలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు

బంగారం ఏటీఎంలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు


రానున్న నలభై ఐదు రోజుల్లోపు నగరంలోని గుల్జార్ హౌస్, సికింద్రాబాద్, అబిడ్స్ ప్రాంతాలలో మూడు గోల్డ్ ఏటీఎం లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఒక్కో ఎటిఎం మెషిన్ లో రెండున్నర కోట్ల విలువైన ఐదు కిలోల బంగారం ఉంటుందని ఈ బంగారం ఏటీఎంలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు పనిచేస్తాయని వెల్లడించారు. ఇలాంటి ఏటీఎంలో ఇప్పటివరకు బ్రిటన్, దుబాయ్ లో మాత్రమే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+