ప్రయాణికులకు శుభవార్త: కామారెడ్డి రైల్వే స్టేషన్‌కు మహర్దశ ..!!

ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వేస్ పనిచేస్తోంది. ఇందులో భాగంగా పలు రైల్వే స్టేషన్లకు మరమత్తులు చేస్తూ అభివృద్ధి చేస్తోంది. మొత్తం రైల్వే స్టేషన్ లుక్కే మార్చేస్తోంది. దీంతో ప్రయాణికులు మంచి అనుభూతి పొందుతారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.2375 కోట్లు అంచనా వ్యయంతో ప్రయాణికులకు సకల సదుపాయాలు అందాలనే ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ప్రాంతీయ జనాభాను దృష్టిలో ఉంచుకుని ఏమేరకు అభివృద్ధి చేయాలో చేస్తోంది ఇండియన్ రైల్వేస్.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 2023, ఫిబ్రవరి, 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో ఈ పధకం ఊపందుకుంది.ప్రస్తుతం పెద్ద ఎత్తున చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధిలో భాగమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్న ప్రధాన పునరాభివృద్ధి పనులు కూడా ఉన్నాయి.వీటితోపాటు జంట నగరాల ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఇతర రైలు టెర్మినళ్లలో రద్దీని తగ్గించడానికి,చర్లపల్లి స్టేషన్‌ను అన్నిసౌకర్యాలతో అభివృద్ధి చేశారు.నగర ప్రజల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ టెర్మినల్‌గా తీర్చి దిద్దారు.

Good news for Passengers Kamareddi Railway station to be developed under Amrit Bharat station scheme

భారత రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్‌లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిచేయడం లక్ష్యంగా పెట్టుకుని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్విధానాన్ని తీసుకొచ్చింది.ఈ ఆలోచన ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్‌లలో పాట్రోనేజ్ పెంపొందించే మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ కీలక అంశాల అమలుపై ఆధారపడింది.

Good news for Passengers Kamareddi Railway station to be developed under Amrit Bharat station scheme

కామారెడ్డి రైల్వేస్టేషన్‌క మహర్దశ

అమృత్ భారత్ స్టేషన్ పథకం క్రింది పునరాభివృద్ధికై ఎంపిక చేసిన 40 రైల్వే స్టేషన్‌లలో కామారెడ్డి స్టేషన్ ఒకటి.తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు కామారెడ్డి పట్టణం ప్రధాన జిల్లా కేంద్రం .1896 సంవత్సరంలో 629 కి.మీ పొడవుతో హైదరాబాద్ నుండి మన్మాడ్ జంక్షన్ రైలు మార్గంను ప్రారంభించారు.ఇది దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఉంది.ఇది పూర్వం నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే (ఎన్.జి.ఎస్.ఆర్.), గోదావరి వ్యాలీ రైల్వేలచే నిర్మించబడిన హైదరాబాద్- మన్మాడ్ రైల్వే లైన్‌గా పిలుస్తుండేవారు.సికింద్రాబాద్-మన్మాడ్ తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్న ఒక ముఖ్యమైన రైలు మార్గం.సికింద్రాబాద్-మన్మాడ్ రైలు మార్గం కామారెడ్డిని కలుపుతూ భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులను ప్రయాణీకులకు రవాణా సేవలను అందించే ప్రధానమైన వనరుగా ఉంది .

Good news for Passengers Kamareddi Railway station to be developed under Amrit Bharat station scheme

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రణాళిక చేయబడిన సౌకర్యాలు :

• కామారెడ్డి రైల్వే స్టేషన్ హైదరాబాద్ డివిజన్ పరిధిలో నాన్-సబర్బన్ గ్రేడ్-4 (ఎన్.ఎస్.జి.-4)గా వర్గీకరించబడింది.
•కాచిగూడ - ముద్ఖేడ్ మార్గంలోనున్న ఈ స్టేషన్ కామారెడ్డి మరియు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రయాణికులకు సేవలను అందిస్తుంది.
•ఈ స్టేషన్‌లో సికింద్రాబాద్,నాగర్‌సోల్,ముంబై,నాందేడ్,తిరుపతి,బెంగళూరు మొదలైన అనేక దిశలలో ముఖ్యమైన సూపర్‌ఫాస్ట్ రైళ్లు కూడా ఆగుతాయి.
•ఈ స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పధకం (ఏ.బి.ఎస్.ఎస్.) కింద సుమారుగా రూ.39.84 కోట్లతో పునరాభివృద్ధి చేయడానికి గుర్తించబడింది .

Good news for Passengers Kamareddi Railway station to be developed under Amrit Bharat station scheme

ప్రతిపాదిత పనులు
సుమారు 360 చ.మీ. విస్తీర్ణంతో స్టేషన్ భవన పునరాభివృద్ది.
స్టేషన్ ప్రాంగణం అభివృద్ధి (సుమారు 2450 చ.మీ.లు )
స్టేషన్ మొదటి ప్రవేశ ద్వారం సౌకర్యాల అభివృద్ధి.
రెండవ ప్రవేశం ఏర్పాటు మరియు ఇప్పటికే ఉన్న షెడ్‌ను బుకింగ్ కార్యాలయంగా మార్చడం.
మొదటి ప్రవేశంలో జి.ఆర్.పి. కార్యాలయాన్ని కూల్చివేయడం పూర్తయింది మరియు ట్రాక్ మెషిన్ విశ్రాంతి గదిని జి.ఆర్.పి. కార్యాలయంగా మార్చడం పురోగతిలో ఉంది.
ప్రయాణీకుల సౌకర్యార్థం 3 లిఫ్ట్‌లు & 2 ఎస్కలేటర్ల ఏర్పాటుతో పాటు 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన నిర్మాణం.
ప్లాట్‌ఫారమ్ ఉపరితల మెరుగుదల.
ప్లాట్‌ఫారమ్‌ పై అదనపు కప్పు ఏర్పాటు.
దివ్యాంగుల సౌకర్యాలతో సహా టాయిలెట్ల మెరుగుదలలు మరియు నిర్మాణం.
స్టేషన్ ప్రాంగణంలో కళలు మరియు సంస్కృతిని వర్ణించడం.
ప్రయాణీకులకు అనుకూలంగా కోచ్ ల ను తెలిపే మరియు రైళ్ల రాకపోకలను తెలియజేసే సూచిక బోర్డులు.
వి.ఐ. పి.లాంజ్‌ అభివృద్ధి పనులు పూర్తి చేయబడినాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో అన్ని పనులు ఏకకాలంలో శర వేగంగా జరుగుతున్నాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+