తెలంగాణ హౌస్ సర్జన్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని హౌస్ సర్జన్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్లకు శుభవార్త చెప్పింది. వారి ఉపకార వేతనం 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2023, జనవరి 1 నుంచి ఉపకార వేతనం పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి ప్రారంభం
జడ్చర్ల మండల కేంద్రంలో 100 పడకల ఆస్పత్రిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చని పంటలతో కళకళలాడుతోందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

కరువును తరిమికొట్టి.. వలసలను వాపస్ తీసుకొచ్చిన కేసీఆర్ వెంటే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14కు 14 స్థానాల్లో ఎగిరేది గులాబీ జెండానే అని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. 2018లో లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారని.. కరోనా వల్ల కొంత ఆలస్యమైందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు సకల సౌకర్యాలతో ఈ ఆస్పత్రిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
మహబూబ్‌నగర్‌కు మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత లక్ష్మారెడ్డిదేనన్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డికి అబద్దాలు చెప్పడం అలవాటై పోయిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల కంటే కాంగ్రెస్, బీజేపీలు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications