నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. ఆ ఉద్యోగాలు స్థానికులకే!

నిరుద్యోగులకు తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. హన్మకొండ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించిన ఆయన ఈ సందర్భంగా ఉద్యోగాల విషయంలో స్థానికులకు సంతోషం కలిగించే వార్తను చెప్పారు.

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పనులపై మంత్రి సమీక్ష
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన పరకాలలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారని తెలిపారు.కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మంజూరు చేసిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు.

Good news for the unemployed kakatiya mega textile park jobs are for locals

స్కిల్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా నైపుణ్యం
అంతేకాదు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని దీనికోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా నైపుణ్యం కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. అంతేకాదు ప్రస్తుతం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నడుస్తున్న యంగ్ వన్, గణేశ ఈకో టెక్సటైల్ కంపెనీల నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో శరవేగంగా పనులు
ఇక వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రికి వివరించారు. పనులు త్వరితగతిన చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. అంతర్గత బిటి రోడ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. వాటర్ డ్రైన్, విద్యుత్ సప్లై పనుల టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని త్వరలో పనులు మొదలు పెడతారని తెలిపారు.

కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయాలన్న మంత్రి దుద్దిళ్ళ
అంతేకాదు ఆర్ అండ్ ఆర్ కాలనీలో కూడా త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశుసంవర్ధక శాఖ ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఇక దీనికి అదనంగా కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచించారు టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

స్థానిక యువతకే ఉద్యోగాలు
అభివృద్ధి పనులు పూర్తి చేసిన తర్వాత స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఇక తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలతో వరంగల్ జిల్లాలోని స్థానికులకు, యువతకు ఉద్యోగాల కల్పన పైన శుభవార్త చెప్పినట్టు అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+