శ్రీశైలం వెళ్లేవారికి శుభవార్త...బస్‌టికెట్‌తో పాటే దర్శన టికెట్...
ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలకు కొదవే లేదు. అందులో ముఖ్యంగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు. అయితే, శ్రీశైలం వెళ్లేవారికి తెలంగాణ ఆర్‌టిసి ఓ శుభవార్తను చెప్పింది. ఆర్‌టిసి బస్సుల్లో టిక్కెట్ తీసుకునేవారికి ఇకనుంచి శ్రీశైలం ఆలయంలో దర్శన టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకరానున్నారు. ఈ అవకాశం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు వర్తిస్తుంది. రోజుకు 1200 దర్శన టిక్కెట్లు శ్రీశైలం వెళ్లే భక్తులు, ప్రయాణికులకు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్‌టిసి అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దర్శనానికి వెళ్లేవారికి తెలంగాణ ఆర్‌టిసి శుభవార్తను చెప్పింది. ప్రతి రోజు 1200 దర్శన టిక్కెట్లు ప్రయాణికులకు ఇవ్వనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకునేవారికి శ్రీశైల ఆలయానికి దర్శన టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యానికి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో 200 స్పర్శ దర్శనం, 500 అతి శీఘ్రదర్శనం, మరో 500 శీఘ్ర దర్శనం టికెట్లు ఉంటాయని తెలంగాణ ఆర్‌టిసి అధికారులు పేర్కొన్నారు. ఇక, ఈ దర్శన టిక్కెట్లను కూడా ఆర్‌టిసి అధికారులు వెల్లడించడం జరిగింది.

స్పర్శదర్శనం టికెట్ ధర రూ.500, అతి శీఘ్రదర్శనం రూ.300, శీఘ్రదర్శనం టికెట్ ధర రూ.150 ఉంటుందని ఆర్‌టిసి వర్గాలు వివరించాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఆలయానికి పది ఏసీ బస్సులను నడిపేందుకు ఇప్పటికే ఆర్‌టిసి సిద్దమైన సంగతి తెలిసిందే. ఇక, ఈ బస్సులను శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. అయితే ఈ బస్సుల్లో ప్రయాణించేవారు టికెట్ తీసుకునే సమయంలోనే దర్శన టికెట్లు బుక్ చేసుకొని సదుపాయాన్ని ఆర్‌టిసి కల్పించడం జరిగింది.
పది సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు: 100 కొత్త బస్సులను సీఎం ప్రారంభించగా... అందులో 90 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 10 సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు ఉండనున్నాయి.ఇక సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు వారం రోజుల్లోగా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు తెలంగాణ ఆర్‌టిసి అధికారులు వివరించారు. ఈ బస్సుల్లో ఛార్జీలు ఇలా ఉన్నాయి. పెద్దలకయితే జేబీఎస్ నుంచి రూ.750, పిల్లలకయితే 540 రూపాయలు, MGBS నుంచి 700 రూపాయలు, 510 రూపాయలుగా ఖరారు చేసింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రతి 50 నిమిషాలకు ఒక ఏసీ బస్సు, ప్రతి 20 నిమిషాలకు ఓ సూపర్ లగ్జరీ బస్సు అందుబాటులో ఉంటుందని ఆర్‌టిసి అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications