ఆ రైల్వేస్టేషన్ జంక్షన్ గా మారుస్తూ కేంద్రం శుభవార్త!

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పైన భారతీయ రైల్వే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక కొత్త రైలు మార్గాలను ఏర్పాటు చేస్తున్న రైల్వే శాఖ అమృత్ భారత్ స్టేషన్లలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తుంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న మూడు స్టేషన్లతో పాటుగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది.

తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్ రైల్వే జంక్షన్ గా
ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక శుభవార్తను చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు నడికుడి మార్గంలో నల్గొండ జిల్లా సరిహద్దులో విష్ణుపురం రైల్వే స్టేషన్ ను రైల్వే జంక్షన్ గా మార్చాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

Good news from center south central railway decided to change Vishnupuram railway station into railway junction

తెలంగాణలోనే అతిపెద్ద థర్మల్ ప్లాంట్ కోసం
దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 20,000 మెగా వాట్ల సామర్థ్యంతో తెలంగాణలోనే అతిపెద్ద థర్మల్ ప్లాంట్ ను నిర్మిస్తున్న క్రమంలో దీనికి సమీపంలోనే ఉన్న విష్ణుపురం రైల్వే స్టేషన్ ను విష్ణు పురం జంక్షన్ గా మార్చాలని నిర్ణయించింది. యాదాద్రి ధర్మల్ ప్లాంట్ కు ప్రతిరోజు 21 రైల్వే వ్యాగన్లలో కరీంనగర్, రామగుండం నుంచి బొగ్గు రవాణా చేయాల్సి ఉంటుంది.

దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
జాన్ పహాడ్ మార్గంలో ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ కు అదనంగా మరో లైన్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని విష్ణుపురం స్టేషన్ ను జంక్షన్ గా చేయాలని అధికారులు ప్రతిపాదించగా దక్షిణ మధ్య రైల్వే కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

ఈ రైలు మార్గాలు కలిసే స్టేషన్ విష్ణుపురం స్టేషన్
ఎక్కడైనా సాధారణంగా మూడు రైల్వే మార్గాలు కలిసే స్టేషన్ ను మాత్రమే జంక్షన్ గా మారుస్తారు. అయితే విష్ణుపురం స్టేషన్ విషయానికి వస్తే ఈ స్టేషన్ ను కలుపుతూ గుంటూరు బిబి నగర్ రైల్వే లైన్ ప్రస్తుతం ఒక మార్గంగా ఉంది. అయితే దీనిని తాజాగా రెండు వరుసలుగా విస్తరిస్తున్న క్రమంలో ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇక మిర్యాలగూడ గుంతకల్లు రైల్వే లైను సైతం త్వరలోనే అందుబాటులోకి రానుంది.

జంక్షన్ ఏర్పాటు నిర్ణయం ఇందుకే
ఈ రైళ్లన్నీ అందుబాటులోకి వస్తే విష్ణుపురం రైల్వే స్టేషన్ లో రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు గుంటూరు జాన్ పహాడ్ లైను, వీర్లపాలెం థర్మల్ ప్లాంట్ రైలు మార్గాలు ఇక్కడ కలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ జంక్షన్ ను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ స్టేషన్ ను కలిపే రైల్వే లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

జంక్షన్ గా మారనున్న విష్ణుపురం రైల్వే స్టేషన్
ఇదే గనక పూర్తయితే త్వరలో విష్ణుపురం రైల్వే జంక్షన్ కు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తుంది. మొత్తానికి యాదాద్రి థర్మల్ ప్లాంట్ కోసం విష్ణుపురం రైల్వే స్టేషన్ ను విష్ణుపురం రైల్వే జంక్షన్ గా మార్చనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+