ఆ బస్టాండ్ పై భారీ శుభవార్త.. కొత్త ఏడాదిలో పనులు షురూ!

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా, రెండవ రాజధానిగా వరంగల్ ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అటువంటి వరంగల్ లో రెండేళ్ల కాలంగా పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ముందుకు వెళుతున్నప్పటికి ఒక ముఖ్య ప్రాజెక్టు నత్తకు నడకలు నేర్పిస్తున్నట్టు మారింది.

ఆగిపోయిన వరంగల్ బస్ స్టాండ్ పనులు
దాదాపు రూ.74.50 కోట్ల వ్యయంతో స్మార్ట్ సిటీ పథకం కింద ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక వరంగల్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది . దీనిపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా నిర్మిస్తున్న స్మార్ట్ సిటీ మోడల్ బస్టాండ్ పనులు గత రెండేళ్లుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

good news on warangal model busstand works will start again in new year

అన్ని అనుమతులు ఉన్నా నిధుల కొరత
తాజాగా ఈ బస్టాండ్ నిర్మాణానికి 74.5 కోట్ల రూపాయల అనుమతులు లభించాయి. అయితే దీని నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నా, నిధుల కొరత, కాంట్రాక్టర్ల వివాదాల వల్ల పనులు ఆగిపోయాయి అన్న చర్చ కూడా స్థానికంగా జరుగుతుంది. .వరంగల్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావించిన ఈ మోడల్ బస్టాండ్ పనులను కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ చేయించవలసి ఉంది. అయితే నిధుల కొరత కారణంగా పనులకు ఇబ్బంది కలుగుతుంది.

కుడాకు రావాల్సిన నిధులు రాకపోవటం కారణం
. అన్ని సాంకేతిక పరిపాలన అనుమతులు లభించినప్పటికీ నిధుల కొరత ప్రధాన ఆటంకంగా మారగా పనులు జరగడం లేదు. కాళోజీ కళాక్షేత్రం కోసం ప్రభుత్వం నుంచి కుడా కు రావలసిన 70 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండటం, అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు కూడా ఇచ్చిన 45 కోట్ల రూపాయలు తిరిగి రాకపోవడం ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభానికి కారణంగా కనిపిస్తుంది.

బస్టాండ్ నిర్మాణం కోసం స్థానికుల డిమాండ్
కారణాలు ఏవైనప్పటికీ బస్టాండ్ లేక స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మోడల్ బస్టాండ్ ను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వచ్చే 30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా రూపొందించారు. ఇప్పటికైనా కొత్త సంవత్సరంలోనైనా బస్టాండ్ పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు అధికారులు కూడా నూతన సంవత్సరంలో జనవరి నెలలో ఈ బస్టాండ్ పనులను పునః ప్రారంభించాలని నిర్ణయించారు . ఒకవేళ పనులు వేగవంతం అయితే 2026 నాటికి ఆధునిక బస్టాండ్ ప్రజలకు సేవలు అందిస్తుంది అనే భావన వ్యక్తం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+