విశాఖ వాసులకు పండుగే.. మరో గ్రీన్ ఫీల్డ్ హైవేతో కేంద్రం శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ రోడ్డు రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి కేంద్రం అనేక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖపట్నం ఖరగ్ పూర్ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయం తీసుకుంది.
మరొక నేషనల్ హైవేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
ఇక కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక నేషనల్ హైవే రాబోతుంది. ఇది ఏపీలోని రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేస్తూ ఏపీ ప్రగతికి దోహదం చేయనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ను అనుసంధానం చేస్తూ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ను నిర్మించాలని నిర్ణయించిన కేంద్రం దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించడం కోసం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ద్వారా టెండర్లను పిలిచింది.

783 కిలోమీటర్ల మేర ఆరు లైన్లుగా గ్రీన్ ఫీల్డ్ హైవే
కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్టులో భాగంగా దీనిని నిర్మించడానికి నిర్ణయం తీసుకుంది. ఇక గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి ప్రధాన విషయాల వివరాలలోకి వెళితే విశాఖపట్నం ఖరగ్ పూర్ మధ్య 783 కిలోమీటర్ల మేర ఆరు లైన్లుగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ను నిర్మాణం చేస్తారు. ఈ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్ పూర్ కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది.
విశాఖ ఖరగ్ పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రధాన లక్ష్యం ఇదే
అంతేకాదు విశాఖపట్నం, భావనపాడు, గోపాలపూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానం చేస్తుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా తూర్పు ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణా వేగవంత అవుతుంది. లాజిస్టిక్ రంగ అభివృద్ధి కోసం ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ను నిర్మించడానికి కేంద్రం నిర్ణయించింది. మొత్తం ఏడాదిన్నరలోగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
2025 జూన్ నాటికి పనులు ప్రారంభించే ప్లాన్
ఈ గ్రీన్ ఫీల్స్ హైవే నిర్మాణం కోసం డిపిఆర్ రూపొందించేందుకు ప్రస్తుతం టెండర్లు పిలవగా ఇప్పటికీ 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్ చివరివారానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఏ సంస్థ దీనిని నిర్మాణం చేస్తుందో ఖరారు చేస్తుంది. 2025 జూన్ నాటికి మొత్తం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభిస్తుంది .
రెండు ప్యాకేజీలలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు
పనులు ప్రారంభించిన తర్వాత ఏడాదిన్నరలోగా దీనిని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో విశాఖపట్నం నుండి ఒడిస్సా లోని ఖుర్దా రోడ్ వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్డు నుంచి ఖరగ్ పూర్ వరకు మరొక ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్టు పనులను చేపడతారు. మొత్తంగా ఏపీకి కేంద్రం వరుసగా వరాల జల్లు కురిపిస్తూ ఏపీ ప్రగతికి దోహదం చేస్తుంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications