ఆ రైళ్ళ హాల్టింగ్ తో ఆ ప్రాంత వాసులకు ముందే సంక్రాంతి!

భారతీయ రైల్వే ప్రయాణికుల రైల్వే సేవలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పైన ఫోకస్ చేస్తున్న రైల్వే, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది లేకుండా అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో చాలా చోట్ల అవసరమైన రైళ్లకు హాల్టింగ్ కల్పించడంలో కూడా రైల్వే ప్రయాణికుల మన్ననలు పొందుతుంది.

మూడు ఎక్స్ ప్రెస్ రైళ్లకు శంకరపల్లి రైల్వే స్టేషన్ లో హాల్టింగ్
తాజాగా వికారాబాద్ జిల్లాలోని శంకరపల్లి రైల్వేస్టేషన్లో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించింది. రాయచూర్- పర్భని ఎక్స్ ప్రెస్, హైదరాబాద్ - విజయపుర రైళ్ళ హాల్టింగ్ కోసం శంకరపల్లి ప్రజలు దశాబ్దాల నుండి ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే శాఖకు తమ విజ్ఞప్తులను పంపుతున్నారు. అయితే ఎట్టకేలకు వారి విజ్ఞప్తి విన్న రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

good news two express trains hault started in Shankarpally railway station

జెండా ఊపి పర్భని ఎక్స్ ప్రెస్ రైలును హాల్ట్ చేసిన ఎంపీ
మూడు ఎక్స్ప్రెస్ రైళ్లకు శంకరపల్లి రైల్వేస్టేషన్లో హాల్టింగ్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో నిన్న రాత్రి చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పర్భని ఎక్స్ప్రెస్ నిలుపుదలను జెండా ఊపి ప్రారంభించారు. గతంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు స్థానిక నేతలు ఆయనకు ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలని విజ్ఞప్తులు చేశారు.

పురోగతిలో శంకరపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సానుకూలంగా స్పందించిన రైల్వేశాఖ ఈ సౌకర్యాన్ని కల్పించింది. కేంద్రం శంకరపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు నిధులు కేటాయించగా అండర్ పాస్ లు, వంతెనల నిర్మాణ పనులు కూడా ప్రణాళికలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయడం ఇక్కడ ఉన్నవారికి చాలా లబ్ధిని చేకూరుస్తుంది.

రైల్లో ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ముఖ్యంగా చిరు వ్యాపారాలు చేసుకునేవారు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు హైదరాబాద్ ప్రయాణం చేయడానికి సమయం ఆదా అవుతుంది. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా రైలులో ప్రయాణం చేసి ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు అన్ని వసతులు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది అడిగి తెలుసుకున్నారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్టిలో పెట్టుకొని దక్షిణమధ్య రైల్వే కూడా పలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన ప్రయాణసౌకర్యాన్ని కల్పిస్తోంది.

సంక్రాంతికి రైల్వే ప్రత్యేక రైళ్ళు
సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో కూడా పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు నిలుపుదల కల్పిస్తోంది. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ఐటీ ఉద్యోగులు సికింద్రాబాద్, నాంపల్లి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా హైటెక్ సిటీ నుంచే రైలు ఎక్కే అవకాశం ఉంది. సంక్రాంతి ప్రత్యేక రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ ఇవ్వడం వల్ల నగర ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+