వనవాసం ముగిసింది: ఏడాది తర్వాత బీజేపీ ఆఫీసుకు రాజా సింగ్
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ నగరంలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. దాదాపు ఏడాది తర్వాత ఆయన పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టారు. గత ఏడాది అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజా సింగ్‌ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
అప్పట్నుంచి రాజా సింగ్ పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్నారు. తాజాగా, ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. దీంతోపాటు రాజా సింగ్ ను మళ్లీ గోషామహల్ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయన భారీ ర్యాలీగా ఆదివారం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. రాజా సింగ్‌ను హత్తుకుని కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. రాముడికి 14 ఏళ్ల వనవాసం ఉంటే.. తనకు 14 నెలలు వనవాసం వేశారని ఈ సందర్బంగా రాజాసింగ్ వ్యాఖ్యానించారు. చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి రావడం సంతోషంగా ఉందన్నారు.
VIDEO | "I thank the central and state (Telangana) committees of the party for giving me the ticket from Goshamahal assembly constituency for the third time," says BJP leader T Raja Singh.#TelanganaAssemblyElections2023 pic.twitter.com/CnX3PMieV9
— Press Trust of India (@PTI_News) October 22, 2023
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఓ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గత ఏడాది రాజా సింగ్ పై బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ బీజేపీ ఆదివారం నిర్ణయం తీసుకుంది. కాగా, గతంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ రాజా సింగ్ పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications