Kinnera Mogulaiah: పద్మశ్రీ కిన్నెర మొగులయ్య కళాకారుల పెన్షన్ పై ప్రభుత్వ స్పందన!!

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక జానపద కళాకారుడు కిన్నెర మొగులయ్య కూలి పని చేసుకుంటున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యకు పెద్ద కష్టం వచ్చిందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయనకు ప్రభుత్వ అండగా ఉండడం లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

ఆర్ధిక ఇబ్బందులను చెప్పిన కిన్నెర మొగులయ్య
గత ప్రభుత్వ హయాంలో ప్రతీనెల వచ్చే పదివేల రూపాయల పింఛన్ కూడా ఇప్పుడు ఆగిపోయిందని కిన్నెర మొగులయ్య చెప్పడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారుల పట్ల వివక్షతతో వ్యవహరిస్తుందని పలువురు భావించారు. కిన్నెరవాద్యకళాకారుడు మొగులయ్యకు గత ప్రభుత్వం కోటి రూపాయలను ఇవ్వగా, ఆయన ఆ డబ్బుతో తన పిల్లల పెళ్లిళ్లు చేయడంతో పాటు, హైదరాబాద్ సమీపంలోని తుర్కయామంజల్ లో ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టడంతో డబ్బులన్నీ ఖర్చయిపోయాయని చెప్పారు.

Government response on Padmasri Kinnera Mogulaiah artists pension

పించన్ పడకనే కూలి చేస్తున్నానన్న మొగులయ్య
తన కుమారుల్లో ఒకరు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారని, తాను కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని, ప్రతినెలా మందుల కోసం ఏడు వేల రూపాయలు ఖర్చవుతుందని, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే తాను కూలి పని చేస్తున్నట్టుగా కిన్నెర మొగులయ్య వెల్లడించారు. గత ప్రభుత్వం ఇస్తున్న పదివేల రూపాయల పింఛన్ కూడా ఆగిపోవడంతో తాను ఈ పని చేయవలసి వస్తుందని ఆయన చెప్పినట్టు వార్తలు రావడంతో, దీనిపై ప్రభుత్వం స్పందించింది.

స్పందించిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ
ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే పదివేల రూపాయల పింఛన్ కిన్నెర మొగులయ్యకు అందుతుందని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మొగులయ్యపై వస్తున్న వార్తలు నిరాధారమైన వార్తలని, ఆయనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఆయన కళను గౌరవించి కేంద్రం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించిందన్నారు.

కళాకారుల పెన్షన్ పై ప్రభుత్వం చెప్పిందిదే
పద్మశ్రీ కోసం ప్రతిపాదనలు పంపించడం దగ్గర నుండి నగదు ప్రోత్సాహక బహుమతిని, నెలనెలా కళాకారుల పెన్షన్ను అందించడం వరకు ప్రతి ఒక్కటి ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. ఇక మొగులయ్యకు సంబంధించి పెన్షన్ అందుతుందని ప్రభుత్వం కూడా వెల్లడించింది. సిపిఆర్వో అయోధ్య రెడ్డి కూడా ఐ ఎఫ్ఎంఐఎస్ రిపోర్ట్ ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

మొగులయ్యకు పెన్షన్ ఇచ్చిన రిపోర్ట్
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ కవులను, కళాకారులను గౌరవిస్తూనే ఉందని, వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించి గౌరవంగా చూస్తుందని చెప్పుకొచ్చారు. దర్శనం మొగులయ్య, గుస్సాడి కనకరాజు తదితరులకు క్రమం తప్పకుండా పెన్షన్ చెల్లిస్తున్నాం అని పేర్కొన్నారు. మార్చి 31న మొగులయ్య కు పెన్షన్ చెల్లించిన రిపోర్టును ఎక్స్ వేదికగా పంచుకున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+