Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశంలోనే నెం.2గా తెలంగాణ: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగ పాఠం, కాంగ్రెస్ వాకౌట్

రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోందని, ఐటీ రంగంలో దేశంలోనే హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్ నర్సింహన్.

హైదరాబాద్: రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోందని, ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్ నర్సింహన్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజలకు లబ్ధి చేకూరేలా జరగాలని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారి ఆశయాలకు అనుగుణంగా సభ కొనసాగాలని ఆకాంక్షించారు.

Governor ESL Narasimhan speech in Telangana assembly budget sessions

సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని చెప్పారు. ప్రజల వద్ద పాలన చేరడానికి ఇది దోహదం చేస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన ఆరెళ్లలోనే విద్యుత్ సమస్యను తీర్చేశామని తెలిపారు. రాష్ట్రాన్ని విద్యుత్ లోటు స్థితి నుంచి మిగులు విద్యుత్ స్థాయికి తీసుకొచ్చామని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిపై దీర్ఘ దృష్టితో వ్యవహరిస్తున్నామని తెలిపారు. 24గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు.

వ్యవసాయ రంగానికి 9గంటల విద్యుత్ అందిస్తున్నామని, వేసవిలో కూడా నిరంతరాయంగా విద్యుత్ అందిస్తామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో సేవా రంగం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని తెలిపారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తుందన్నారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల కోసం 35వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ ఈ ఏడాది పూర్తవుతుందని తెలిపారు. కొత్త జాతీయ రహదారులకు నిధులు తేవడం విజయవంతమయ్యామని గవర్నర్ చెప్పారు. 'సంక్షేమ ఫలాలు ప్రతి పౌరునికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, హరితహారం కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టాం' అని తెలిపారు.

'ప్రతి గ్రామంలో కనీసం 40వేల మొక్కలు నాటేగా కార్యాచరణ రూపొందించాం. రాష్ట్ర విభజన తర్వాత రహిదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి గ్రామం, ఆయా మండలాలకు అనుసంధానంగా రహదారి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అభివృద్ధిలో 13.2 శాతం, సేవారంగంలో 14.5 వృద్ధిరేటు సాధించాం. రాష్ట్రం ఏర్పడిన 9 నెలల్లోనే కరెంటు కోతలు లేకుండా చేశాం.' అని గవర్నర్‌ తెలిపారు.

'సంక్షేమ పథకాల అమలు దేశంలోనే ముందున్నాం. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చాం. మైనార్టీల కోసం 201 పాఠశాలలను ప్రారంభించాం. అంగన్ వాడీ వర్కర్ల జీతాలను 10,500కు పెంచాం' గవర్నర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి స్థానాన్ని సాధించామని తెలిపారు. ప్రభుత్వం సులభతర వాణిజ్యం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రం 13.2 శాతం వృద్ధిరేటు సాధించిందని తెలిపారు. సేవా రంగం 14.6 శాతం వృద్ధి సాధించిందన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధి 17.2 శాతంగా ఉందని తెలిపారు.

అవినీతికి తావు లేకుండా పారిశ్రామిక అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. పారిశ్రామిక అనుమతలు 15 రోజుల్లోనే ఇస్తున్నామని గుర్తు చేశారు. వృద్ధులు, వింతతువులు, వికలాంగులకు గతం కంటే మెరుగ్గా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఎక్కడా లేని విధంగా తొలిసారి బీడీ కార్మికులకు రూ. 1000 పెన్షను ఇస్తున్నామన్నారు. ఒంటరి మహిళలకు రూ. 1000 భృతి ఇవ్వబోతున్నామని చెప్పారు.

పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 51 వేల ఆర్థిక సాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం చేస్తుందన్నారు. రాష్ర్ట సాధనలో అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థియ సాయం చేస్తుందని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. గవర్నర్ తన ప్రసంగాన్ని 40నిమిషాల్లో ముగించారు. కాగా, గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలే ఉన్నాయని కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+