Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో జగన్, ఫడ్నవీస్ .. ఆవిష్కృతం కానున్న మహా ఘట్టం

Recommended Video

    కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో జగన్,ఫడ్నవీస్..!! || Oneindia Telugu

    తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల నేటితో నెరవేరబోతోంది. కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తెలంగాణలో రైతుల కన్నీళ్లు తుడవటానికి చేసిన భాగీరధ యత్నం నేను ఫలించబోతుంది. తెలంగాణ ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును మరికాసేపట్లో కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10:30 గంటలకు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు . సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని హోమంలో పాల్గొంటారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం 10:50కి కన్నెపల్లి చేరుకొంటారు. 11.40 కి పంపుహౌస్‌ను ప్రారంభిస్తారు.

    కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి రావద్దని కాంగ్రెస్ హెచ్చరిస్తున్నా అవేవీ లెక్క చెయ్యకుండా సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ఉదయం 9:30 గంటలకు ఆయన మేడిగడ్డ చేరుకుని అక్కడ కార్యక్రమంలో పాల్గొననున్నారు . అనంతరం 11 గంటలకు కన్నెపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి అమరావతి బయలుదేరుతారు.

    Governor inaugurate Kaleshwaram today...Jagan, Fadnavis grace the occasion

    ఇక, ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న మరో ముఖ్య అతిథి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 9:55కు మేడిగడ్డకు చేరుకున్నారు . మేడిగడ్డలో జరిగే ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్‌లో కన్నెపల్లి పంపు హౌస్‌కి చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం కాళేశ్వరం ఆలయాన్ని సందర్శిస్తారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా పూజలు సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+