వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ ప్రశ్నలతో మంత్రి ఉక్కిరి బిక్కిరి: సీఎంతో కాకుండా నేరుగా..: అసలేం..జరుగుతోంది..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

TSRTC Samme : Tamilisai Soundararajan Enquires About TSRTC Samme || Oneindia Telugu

తెలంగాణ గవర్నర్ ఆర్టీసీ సమ్మెలో జోక్యం చేసుకుంటారని ప్రభుత్వం అంచనా వేకలేకపోయింది. సాధారణంగా గవర్నర్ ఏదైనా ప్రభుత్వ పరమైన అంశాలుంటే నేరుగా ముఖ్యమంత్రితో చర్చిస్తారు. కానీ, ఇప్పుడు గవర్నర్ నేరుగా మంత్రికి ఫోన్ చేసారు. ఆర్టీసీ సమ్మె గురించి ఆరా తీసారు. ఆ సమయంలో తన వద్దకు వచ్చిన రాజకీయ పార్టీలు..ఆర్టీసీ జేఏసీ నేతలు ఇచ్చిన సమాచారం మేరకు అసలు ఏం జరుగుతోందరి ఆరా తీసినట్లు తెలుస్తోంది. నేరుగా మంత్రికి ఫోన్ చేయటంతో..ఆయన సైతం ఉన్న పరిస్థితిని వివరించినట్లుగా చెబుతున్నారు.

సీఎం జగన్ కీలక నిర్ణయం: నవంబర్‌ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం: కేంద్రంతో చర్చించి..సీఎం జగన్ కీలక నిర్ణయం: నవంబర్‌ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం: కేంద్రంతో చర్చించి..

ఆ సమయంలో గవర్నర్ వేసిన ప్రశ్నలతో మంత్రి ఇబ్బంది పడినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అసలు..ఈ సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఉందా..కోర్టు ఆదేశాలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించినట్లుగా తెలిసింది. ప్రభుత్వ నుండి అధికారి సునీల్ శర్మ గవర్నర్ వద్దకు వెళ్లి..అన్ని విషయాలను వివరించారు. దీంతో..గవర్నర్ ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి అంటూ సూచన చేసినట్లు సమాచారం.

 మంత్రికి గవర్నర్ ప్రశ్నలతో ఇరకాటం..

మంత్రికి గవర్నర్ ప్రశ్నలతో ఇరకాటం..

ఆర్టీసీ సమ్మె 14వ రోజుకు చేరింది. ఇప్పటికే పలు పార్టీల నేతలు గవర్నర్ ను కలిసి ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సైతం గవర్నర్ కు తమ పరిస్థితిని వివరించారు. గవర్నర్ నేరుగా మంత్రి వ్వాడ అజయ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు. సమ్మె తీవ్రత, సెల్ఫ్‌ డిస్మిస్‌ పేరుతో కార్మికుల తొలగింపు వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అసలేం జరుగుతోందంటూ మంత్రిని ప్రశ్నించారు. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఉందా అని గవర్నర్ నుండి ప్రశ్న రావటంతో మంత్రి సమాధానం ఇవ్వటానికి ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. 48 వేల మంది కార్మికులు తొలగిపోయినట్లు ఎలా చెబుతారని నిలదీసినట్లు తెలిసింది. కోర్టు ఆదేశాలు అమలవుతున్నాయా అని ఆరా తీసారు. ప్రజల ఇబ్బందుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించిన మంత్రి..రవాణా శాఖ కార్యదర్శిని పంపుతున్నామని..పూర్తి నివేదిక ఇస్తారంటూ సమాధానం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ముఖ్యమంత్రితో కాకుండా..మంత్రికే నేరుగా...

ముఖ్యమంత్రితో కాకుండా..మంత్రికే నేరుగా...

రాష్ట్ర పాలనా వ్యవహారాల పైన గవర్నర్ కావాల్సిన సమాచారం సేకరించే అధికారం ఉంటుంది. అయితే, సాధారణంగా గవర్నర్ ప్రభుత్వ సంబంధించిన అంశాలను నేరుగా ముఖ్యమంత్రితో చర్చిస్తారు. ప్రభుత్వానికి అధిపతిగా ఉన్న ముఖ్యమంత్రితో చర్చించి కావాల్సిన సమాచారం తెలుసుకుంటారు. అయితే, ఇప్పుడు గవర్నర్ నేరుగా మంత్రికి ఫోన్ చేసి ఆరా తీసారనే సమాచారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో విశాఖలో ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పైన హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా ఉన్న నరసింహన్ నేరుగా డీజీపీకి ఫోన్ చేసి ఆరా తీసారు. దీని పైన నాటి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.ఇక, ఇప్పుడు తెలంగాణలో మారుతున్న సమీకరణాల్లో ఈ అంశం కీలకంగా ప్రచారం జరుగుతోంది.

 సునీల్‌శర్మతో సమ్మె..చర్యలపై సమీక్ష...

సునీల్‌శర్మతో సమ్మె..చర్యలపై సమీక్ష...

మంత్రి అజయ్ తో మాట్లాడిన తరువాత గవర్నర్ వద్దకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ వెళ్లారు. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆయన్ను గవర్నర్‌ అడిగి తెలుసుకున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ప్రజలకు రవాణా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పలు చర్యలు చేపడుతున్నాయని గవర్నర్‌కు సునీల్‌ శర్మ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 వేలకు పైగా బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా టిమ్స్‌ (టికెట్‌ ఇష్యూయింగ్‌ మెషిన్స్‌)ను కూడా ప్రవేశపెట్టామన్నారు. ప్రైవేటు ఉద్యోగులతో బస్సులను నడుపుతున్నందున కొంత మంది చేతివాటాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపారు. సమ్మెపై పలు పార్టీలు, సంఘాల నుంచి వినతిపత్రాలు వస్తున్నాయని సునీల్‌ శర్మతో గవర్నర్‌ అన్నారు. సమ్మె కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రయాణ సదుపాయాలు మెరుగుపడేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు.

English summary
Governor asked minister Ajay about TSRTC strike and govt steps to splve the problem. With governor questions minister faced some problem to answer. After that Sunil Sharma met and given govt side explanation to governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X