గవర్నర్ అకస్మిక ఢిల్లీ టూర్: సీఎంలు, జగన్ పార్టీపై నివేదిక?
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ఈ రోజు (సోమవారం) ఆకస్మిక ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ఆయన దేశ రాజధానిలో కలవనున్నారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆయన ఢిల్లీ ప్లైట్ ఎక్కనున్నారు.

ఆయన ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల పైన ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం, హోదా పైన ప్రజల సెంటిమెంట్ వంటి అంశాల పైన ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు.
అలాగే, ఇరు తెలుగు రాష్ట్రాల సమస్యల పైన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో సమావేశం అంశం పైన కూడా ఆయన చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే, హోదా కోసం అసెంబ్లీలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన గందరగోళాన్ని ఆయన తన నివేదికలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications