గొడవలు ఉంటాయి, ఫ్యామిలీవి బయట మాట్లాడవద్దు: గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకే కుటుంబంలోని పెద్దలకు, పిల్లలకు మధ్య గొడవలు ఉంటాయని, అవన్నీ సర్దుకుపోతాయని చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

కుటుంబ వ్యవహారాలు బయట మాట్లాడకూడదని వ్యాఖ్యానించారు. కేంద్రం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఏపీ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికరంగా మాట్లాడారు.

ఆపరేషన్ 'రివర్స్': జగన్ పార్టీలోకి విశాఖపట్నం కీలక నేత, అందుకే చేరిక!

Governor Narasimhan interesting comments on AP and Telangana issue

ఒకే కుటుంబంలో పెద్దలకు, పిల్లలకు గొడవలు ఉంటాయని గవర్నర్ చెప్పారు. ఈ కోపతాపాలు సర్దుకుంటాయని చెప్పారు. బంధాలను ఎవరూ విడగొట్టలేరన్నారు. కుటుంబ సమస్యలను బయట బహిర్గతంగా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు.

సంస్కరణలపై వేసిన కమిటీ నివేదికను రాష్ట్రపతికి అందిస్తానని గవర్నర్ చెప్పారు. విభజన చట్టంలోని పలు అంశాలు పెండింగులో ఉన్నాయని చెప్పారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులను కలుస్తానని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Governor Narasimhan interesting comments on Andhra Pradesh and Telangana issue. He was in Delhi on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి