ఫోన్ ట్యాపింగ్‌పై వివరణ: రాజ్‌నాథ్‌తో గవర్నర్ భేటీ, మాట్లాడేందుకు నో!

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. పునర్విభజనకు సంబంధించిన అపరిష్కృత అంశాలు, ఇతర పెండింగ్‌ విషయాలపై చర్చించారు.

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలకు కారణమైన ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌, విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన, ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

రాజ్‌నాథ్‌తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడటానికి నరసింహన్‌ నిరాకరించారు. అంతకుముందు గవర్నర్.. నార్త్‌ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షెడ్యూల్‌ 9, 10 సహా అనేక పాలనాంశాల గురించి చర్చించారు.

Governor Narasimhan meets Rajnath Singh

అనంతరం విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన గురించి మీడియా ప్రశ్నించింది. దీనిపై గవర్నర్ స్పందిస్తూ.. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని చెప్పారు. గవర్నర్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ కార్యదర్శి సిఎల్ గోయల్‌తో విడివిడిగా సమావేశమయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఇద్దరితోను చర్చించారు. రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపు వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా హోంశాఖకు గవర్నర్ సూచించినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వోద్యోగుల పంపిణీని సాధ్యమైనంత త్వరంగా పూర్తి చేస్తామని హోంశాఖ అధికారులు హామీ ఇచ్చినట్టు గవర్నర్ మీడియాకు వెల్లడించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి సమస్యలపై చర్చించామని, పాత సమస్యలే చర్చకు వచ్చాయని గవర్నర్ పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూలులో పొందుపర్చిన అంశాలు చర్చకు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+