వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసుపత్రి చూసి షాకైన గవర్నర్, మంత్రికి ఫోన్: పరీక్షలకు టీచర్స్ లీవ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుక్రవారం నాడు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆస్పత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్యం నిర్వహణపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది తీరుపై ఆరా తీశారు. నేలపై ఉన్న రోగులను చూసి ఆశ్చర్యపోయారు. రోగుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

ఆసుపత్రిలోని పరిస్థితిని గవర్నర్ నరసింహన్ వెంటనే సంబంధింత శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. సమస్యలను ఆయనకు వివరించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి గవర్నర్‌కు చెప్పారు.

Narasimhan

సెలవులు అడుగుతున్న ఉపాధ్యాయులు!

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 2 వెలువడింది. త్వరలో టెట్ ప్రకటన రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం, అధికారులు కంగారుపడుతున్నారంటున్నారు.

టెట్ ప్రకటన రానున్న నేపథ్యంలో వాటికి హాజరయ్యేందుకు చాలామంది ఉపాధ్యాయులు సెలవులు పెడుతున్నారు. వేసవిలో డిఎస్సీ జరగనుంది. మరికొద్ది రోజుల్లో టెట్ ప్రకటన వస్తుంది. టెట్‌‍కు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు.

ఈ క్రమంలో వారు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారు. అనారోగ్య కారణంతో చాలామంది సెలవులు అడుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ నుంచి సర్టిఫికేట్ తప్పనిసరి అని ప్రభుత్వ ఉపాధ్యాయులకు అధికారులు చెబుతున్నారట. ప్రయివేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు చాలామంది డిఎస్సీ, టెట్‌కు సిద్ధమవుతున్నారు.

English summary
Governor Narasimhan visits Gandhi Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X