చాకలి ఐలమ్మ పోరాటపటిమను కొనియాడిన గవర్నర్ తమిళిసై; రజకబంధు ఇవ్వాలన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్!!
తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ లోయర్ ట్యాంక్ బండ్ లోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని గవర్నర్ తమిళి సై కొనియాడారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిజాం నవాబులకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలని చాకలి ఐలమ్మ ను ప్రశంసించారు. నిజాం చేతుల్లో పీడితులుగా ఉన్న ప్రజల కోసం ఎనలేని పోరాటం చేసిన గొప్ప మహిళ అని చాకలి ఐలమ్మ ను గవర్నర్ తమిళిసై కొనియాడారు. తెలంగాణ ప్రజల కోసం ఆమె చేసిన త్యాగం గొప్పదని గవర్నర్ తమిళిసై కొనియాడారు. ఇదిలా ఉంటే చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వ వేడుకలకు గవర్నర్ కు ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ గవర్నర్ తమిళిసై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆమె పోరాట పటిమ అని గుర్తు చేశారు.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలు ఐలమ్మ అని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. అంతటి యోధురాలి విగ్రహం ఇంతవరకు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్ పరిధిలోని ఎల్చగూడలో తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన చాకలి ఐలమ్మ 127వ జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు.
On the occasion of Veeranari CHAKALI ILAMMA Jayanti, I will pay my floral tributes to her portrait today in Lower Tank Bund and in @BJP4Telangana State Office in #Hyderabad. pic.twitter.com/Elx6z7v1wl
— Dr K Laxman (@drlaxmanbjp) September 26, 2022
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చాకలి ఐలమ్మ కు సరైన గౌరవం దక్కలేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. దళిత బంధు, గిరిజన బంధు మాదిరిగా రజక బంధు అమలు చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రజక బంధు అమలు చేసిన తర్వాతే టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications