కాలు జారి క్రిందపడ్డ గవర్నర్ తమిళిసై.. ఆపై సరదా వ్యాఖ్యలు!!
తమిళనాడులోని హైబ్రిడ్ రాకెట్ ప్రయోగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళి సై కాలు జారి క్రిందపడ్డారు.. ఆపై సరదా వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మరోమారు కాలు జారి కింద పడ్డారు. గతంలో కుర్చీలో కూర్చోబోతూ కింద పడిపోయిన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ , తాజాగా నడుస్తూ నడుస్తూనే ఒక్కసారిగా కింద పడిపోయారు. కాలు స్లిప్ అయ్యి ఆమె క్రింద పడ్డారు. తమిళనాడు పర్యటనలో ఉన్న తమిళి సై కింద పడిపోయిన వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు.
తమిళనాడు రాష్ట్రంలోని మావల్లపురం సమీపంలోని పత్తిపులం గ్రామంలో ఇండియా మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమాన్ని నిర్వహించగా, అందులో పాల్గొన్నారు గవర్నర్ తమిళిసై. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై, దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగమిస్తున్న తీరును, రాకెట్ ప్రయోగాల సరళి పైన ప్రసంగించారు. అనంతరం వేదిక దిగి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా కాలుజారి గవర్నర్ కింద పడిపోయారు. దీంతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది గవర్నర్ ను పైకి లేపారు.

గవర్నర్ తమిళిసైకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో భద్రత సిబ్బందితో పాటు అక్కడ ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కింద పడి లేచిన గవర్నర్ ఆపై సరదా వ్యాఖ్యలు చేశారు. తాను కింద పడిపోయిన వార్త టీవీలలో హైలెట్ అవుతుందంటూ గవర్నర్ సరదాగా వ్యాఖ్యానించారు. మీడియాకు ఇదో పెద్ద వార్త అంటూ సరదాగా వ్యాఖ్యానించిన గవర్నర్ తమిళసై తన వ్యాఖ్యలతో అక్కడి వారందరిలో నవ్వులు పూయించారు. నిజంగానే తమిళిసై చెప్పినట్టు గవర్నర్ కింద పడిన వార్త ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.
ఇదిలా ఉంటే గవర్నర్ తమిళిసై పాల్గొన్న ఈ కార్యక్రమంలో సుమారు 3500 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరో తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న 5000 మంది విద్యార్థులు తయారుచేసిన 150 మినీ హైబ్రిడ్ ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ రాకెట్ ప్రయోగ కార్యక్రమాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్, మార్టిన్ ఫౌండేషన్, స్పేస్ జోన్ ఇండియా సంయుక్తంగా చేపట్టి నిర్వహించాయి.












Click it and Unblock the Notifications