Good News: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఉత్తర్వులు జారీ, 30 శాతం ఫిట్‌మెంట్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు శుభవార్త అందించింది. ఇప్పటికే వేతన సవరణ అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. తాజాగా శుక్రవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,21,037 ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పింఛన్ దారులందరికీ 30 శాతం ఫిట్‌మెంట్ అమలు కానుంది.

కనీస వేతనం రూ. 19 వేలు.. 30 శాతం ఫిట్మెంట్..
తాజా ఉత్తర్వుల మేరకు కనీస వేతనం రూ. 19 వేలకు పెరగనుంది. 2018 జులై 1 నాటికి డీఏ 30.392 శాతం మూల వేతనంలో కలుస్తుంది. మొత్తం 30 శాతం ఫిట్మెంట్‌తో వేతన సవరణ అమలు చేయనుండగా, అందుకు అనుగుణంగా ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్లను ప్రభుత్వం సవరించింది. ఈ జూన్ నెల నుంచే ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందనున్నాయి.

జూన్ నెల నుంచి పెరిగిన వేతనాలు..
ఇక ఏప్రిల్, మే నెల బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. నోషనల్ బెనిఫిట్‌ను 2018 జులై 1 నుంచి, మానిటరీ బెనిఫిట్‌ను 2020 ఏప్రిల్ 1 నుంచి, క్యాష్ బెనిఫిట్‌ను 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయించగా.. తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి..

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ 30 శాతం ఫిట్మెంట్..
ఇక, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30 శాతం పీఆర్సీ వర్తింప జేస్తున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. పెన్షనర్ల మెడికల్ అలవెన్సు 350 నుంచి 600కు పెంచిన సర్కారు.. రిటైర్మెంట్ గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచింది.. అంతేగకా, 15 శాతం పెన్షన్ పెంపు 75 సంవత్సరాల నుంచి 70 ఏళ్లకు తగ్గించింది. ప్రస్తుతం ఉన్న 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లను కొనసాగించింది. తాజాగా, పీఆర్సీ ఉత్తర్వులు జారీ చేయడం, ఈ నెల నుంచే పెంచిన మొత్తంతో కలిపి జీతాలు రానుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications