TSRTC: వారికి గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ, పదేళ్ల నిరీక్షణకు తెర

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ఆర్టీసీలో పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 813 మందిని కండక్టర్లుగా తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులతో ఆ పాస్టులను భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే.. పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న కండక్టర్ నియామకాలు చేపడుతున్నామని మంత్రి పొన్నం తెలిపాారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలో 66, సికింద్రాబాద్ 126, రంగారెడ్డి 52, నల్గొండ 56, మహబూబ్‌నగర్ 83, మెదక్ 93, వరంగల్ 99, ఖమ్మం 53, ఆదిలాబాద్ 71, నిజామాబాద్ 69, కరీంనగర్ రీజియన్ 45.. మొత్తం 813 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Govt gives permission to recruit conductor posts in tsrtc

కారుణ్య నియామకాలు (బ్రెడ్ విన్నర్), మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ స్కీం కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి లేదా వారి పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో విధి నిర్వహణలో ఉండగా మరణించిన సిబ్బంది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

మరోవైపు, మహాలక్ష్మీ మహిళల ఉచిత ప్రయాణానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. 275 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఆర్టీసీ 80 బస్సులను ప్రారంభించింది. ఈ ఏడాది జులై నాటికి మరో 1000 బస్సులు రోడ్డెక్కనున్నాయని​ వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మీ పథకం అమలు చేశామన్నారు. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+