ఏ వేవ్, ఎప్పడొస్తదో తెలియట్లేదు -ప్రభుత్వాలకూ అవగాహన కరువు -మళ్లీ ఫీవర్ సర్వే: కరోనాపై కేసీఆర్
తెలంగాణలో కరోనా పరిస్థితులపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ పోకడలపై ప్రభుత్వాలకు సైతం అవగాహన కరువైందని, ఏ వేవ్, ఏ వేరింయట్, ఎప్పుడు ఎక్కడ విజృంభిస్తుందో తెలియడంలేదన్నారు. వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో మరోసారి ఫీవర్ సర్వే జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు.

తెలంగాణలో మరో ఫీవర్ సర్వే
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, వైద్యారోగ్య పరిస్థితుల పై ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనాను గుర్తించి ముందస్తు కట్టడి చేసి, ఇప్పటికే విజయవంతంగా నిర్వహించిన జ్వర సర్వేను మరోసారి రాష్ట్రంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించాలని సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదనీ, ఈ నేపథ్యంలో, రాష్ట్రానికి చెందిన సరిహద్దు జిల్లాల్లో కరోనా ప్రభావం పూర్తిగా సమసి పోలేదన్నారు. అటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ శాస్త్రీయ అధ్యయనం చేసి, కరోనా విస్తరణకు గల కారణాలను క్రిటికల్ అనాలిసిస్' చేయాలన్నారు. అందుకు సంబంధించి శాస్త్రీయ పద్దతుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రేపటి నుంచి సరిహద్దు జిల్లాల్లో..
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ ఆధ్వర్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారుల వైద్య బృందం ఈ నెల 11, 12, 13 తేదీల్లో కరోనా ప్రభావిత సరిహద్దు జిల్లాల్లో పర్యటించి రావాలన్నారు. నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరి ఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు, హెలికాప్టర్ ద్వారా వరుస పర్యటనలను చేపట్టాలని సీఎం ఆదేశించారు. పర్యటన అనంతరం నివేదికను సిద్ధం చేసి కేబినెట్ కు సమర్పించాలన్నారు. జిల్లాల్లో కరోనా విస్తరించడానికి గల ప్రధాన కారణాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పర్యటన సందర్భంగా విశ్లేషించాలన్నారు. కరోనా నియంత్రణకోసం చేపట్టాల్సిన చర్యలను, ముందస్తు నివారణ కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించాలన్నారు. ఇందుకుగాను స్థానిక జిల్లా కలెక్టర్లను, డిపివోలు, మున్సిపల్ కమీషనర్, డిఎంహెచ్ ఓ దవాఖానా సూపరిండెంట్ లతో సహా సంబంధిత స్థానిక అధికారులను సమావేశ పరిచి అప్రమత్తం చేయాలన్నారు.

ప్రభుత్వాలకూ అవగాహన లేదు
సమీక్షలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ''దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి సరియైన కారణాలను ఎవరూ గుర్తించలేకపోతున్నారు. కరోనా అనేది అంతుచిక్కని సమస్యగా పరిణమిస్తున్నది. దాన్ని కట్టడి చేయాలన్నా, ముందస్తుగా నియంత్రించడానికి నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి కూడా ప్రభుత్వాలకు సంపూర్ణ అవగాహన కరువైంది. ఏ వేరియంట్, ఏ వేవ్, ఎప్పడొస్తదో ఎందుకు వస్తదో ఎంత వరకు విస్తరిస్తదో తెలియట్లేదు. ఏ రోగానికైనా దాని కారణం దొరికితే నివారణకు మార్గం సుగమం అయితది. కరోనా రోగ కారణం దాని లక్షణం మొత్తంగా కరోనా స్వరూపం, పర్యవసానాలు అర్థం కాని పరిస్థితి వున్నది. కరోనా నియంత్రణ చాలా సంక్లిష్టంగా మారింది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తం కావాల్సిన అవసరమున్నది. కరోనా నియంత్రణకోసం నూతన మార్గాలను అనుసరించాలె. కొత్త వేరియంట్ ల పేరుతో వేవ్ ల రూపంలో వస్తున్న దశలవారీ కరోనా నియంత్రణకు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ప్రజలను కరోనా బారినుంచి రక్షించుకునే చర్యలను చేపట్టాలె.'' అని చెప్పారు.

పూర్తి సన్నద్ధంగా ఆరోగ్య శాఖ
రాష్ట్రవ్యాప్తంగా కరోనా నియంత్రణలో వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పనితీరు ఎట్లా వున్నది? మందులు ఇంజక్షన్ల లభ్యత సక్రమంగా వున్నదా? సకాలంలో సరఫరా అవుతున్నవా? బెడ్లు ఆక్సీజన్ అందుబాటులో ఉన్నవా? అనే అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. రాష్ట్రం ఇప్పటికే అమలు చేసిన జ్వర సర్వే ద్వారా కరోనాను ముందస్తుగా కట్టడిచేయడంలో సఫలీకృతమయ్యామన్నారు. ఇప్పటికే నిర్వహించి సత్ఫలితాలను రాబట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిన జ్వర సర్వే కార్యక్రమాన్ని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి చేపట్టాలన్నారు. భవిష్యత్తులో కరోనా మరో వేవ్ వస్తుందంటూ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు వైద్యారోగ్యశాఖ పూర్తిస్థాయిలో సంసిద్ధంగా వుండాలని సీఎం స్పష్టం చేశారు.

ఆ రాష్ట్రాల్లో స్టడీ, హెల్త్ సిటీగా వరంగల్..
ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులను, కరోనా నియంత్రణ చర్యలను అధ్యయనం చేయాలని, కరోనా నియంత్రణ కోసం చేయదగ్గ పని ఏమిటో గుర్తించడంలో వైద్యశాఖ అధికారులు కసరత్తు చేసి సఫలీకృతం కావాలని సీఎం అన్నారు. వరంగల్ పట్టణాన్ని హెల్త్ సిటీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానా ఏర్పాటుకు సంబంచిన చర్యల గురించి సీఎం ఆరాతీసారు. నూతన దవాఖానను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం ద్వారా తూర్పు తెలంగాణ మొత్తం వైద్యసేవలకు వరంగల్లుకు తరలేలా ఉండాలన్నారు. అన్ని విభాగాలతో కూడిన సమీకృత భవన సముదాయంగా నూతన ఆసుపత్రి నిర్మాణం వుండాలని సీఎం అన్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications