స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు, మార్గదర్శకాలు..!!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కీలక అడుగు పడింది. పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక... మూడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 25 లేదా 26న ఎన్నికల షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల పై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ జీవో ప్రకారం జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. 50శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ , ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ప్రభుత్వ జీవోతో బీసీలకు సర్పంచ్, వార్డు స్థానాలు 23శాతం దక్కనున్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 545 గ్రామీణ మండలాల్లోని 12,760 గ్రామాలు, వాటిల్లో 1,13,534 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి. ఏప్రాంతంలోనైనా జనాభా సమానంగా ఉంటే లాటరీ విధానంలో ఆ స్థానానిక రిజర్వేషన్ ఖరారు చేయాల్సి ఉంటుంది.

కాగా, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఈ నెల 24న హైకోర్టులో విచారణ పూర్తికాగానే అదేరోజు లేదా మరుసటిరోజు షెడ్యూల్ ప్రకటించాలని ఎస్ఈసీ భావిస్తోంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. డిసెంబరు 17 వరకు వార్డు సభ్యులు, సర్పంచ్ల ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 12,760 పంచాయతీలు, 1,13,288 వార్డులు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటించేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక.. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 25 లేదా 26న ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించేందుకు కసరత్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications