సినిమా ఎగ్జిబిటర్లకు రిలీఫ్- ప్రేక్షకులపై భారం : టిక్కెట్ ధరల పెంపుకు అనుమతి..!!

కొత్త సినిమాలకు విడుదల అవుతున్న సమయంలో ఈ నిర్ణయం టాలీవుడ్ కు కొంత రిలీఫ్ ఇవ్వనుంది. అదే సమయంలో ప్రేక్షకులపైన మాత్రం భారం పడనుంది. సినిమా టిక్కెట్ల వ్యవహారం పైన ఏపీలో వివాదం నడుస్తోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గంచటం..థియేటర్లలో అధికారుల సోదాలు.. సీజ్ చేయటం వంటి నిర్ణయాలతో ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టిక్కెట్ల ధరల పెంపుకు అనుమతి ఇస్తూ అధికారుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు జీవో జారీ అయింది.

Recommended Video

    AP Movie Theaters లో సోదాలు .. మూసివేత| Movie Ticket Prices| Nani
    ఏపీలో వివాదం కొనసాగుతున్న వేళ

    ఏపీలో వివాదం కొనసాగుతున్న వేళ

    టికెట్‌ ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరుతూ థియేటర్ల యజమానులు గతంలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. థియేటర్లలో టికెట్‌ ధరల ఖరారుకు ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు సినిమా టికెట్‌ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్‌ ధరలకు అదనంగా జీఎస్టీ, నిర్వహణ చార్జీలను కూడా వసూలు చేసుకునే అవకాశం కల్పించడంతో ప్రేక్షకులపై భారీగా భారం పడనుంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు సినీ రంగా బాగా నష్టపోయింది.

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    ఎగ్జిబిటర్లు సైతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు టాలీవుడ్ ప్రముఖులు ఇదే అంశం పైన పలు మార్లు అభ్యర్దించారు. ఏపీలో మాత్రం ఇష్టానుసారం సినిమా టిక్కెట్ల ధరల పెంపు సాధ్యం కాదని తేల్చేసింది. టిక్కెట్ ధరలను సెంటర్ల వారీగా గ్రేడింగ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని పైన ఎగ్జిబిటర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ సింగిల్ జడ్జి కోర్టు ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. దీని పైన ఏపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. ప్రస్తుతం ఆ కేసు కొనసాగుతోంది. ఇదే సమయంలో పలు థియేటర్ల పైన అధికారులు సోదాలు చేస్తున్నారు. అనేక థియేటర్లను సీజ్ చేసారు.

    జీఎస్టీ..నిర్వహణా ఛార్జీలు కలిపి

    జీఎస్టీ..నిర్వహణా ఛార్జీలు కలిపి

    ఇలా..ఏపీలో వివాదం కంటిన్యూ అవుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. టిక్కెట్ల పైన జీఎస్టీతో పాటుగా నిర్వహణ ఛార్జీలు..ఆన్ లైన్ ఛార్జీలకు సంబంధించి వివరాలను స్పష్టం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అందులో భాగంగా.. నిర్వహణ చార్జీల కింద ఏసీ థియేటర్లలో టికెట్‌ పై రూ.5, నాన్‌-ఏసీలో టికెట్‌పై రూ.3 వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఛార్జీలను మొత్తంగా కలిపి చూస్తే ప్రేక్షకుడిపైన భారం భారీగా ఉంటుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

    థియేటర్ల నిర్వహణకు మేలు చేసేలా

    థియేటర్ల నిర్వహణకు మేలు చేసేలా


    ప్రభుత్వం నిర్ణయించిన తాజా ధరల ప్రకారం.. ఎ.సి థియేటర్స్‌లో టికెట్‌ కనీస ధర రూ.50 + జీఎస్‌టీ, నాన్‌ ఎ.సి. 30+ జీఎస్‌టీ, మల్టీప్లెక్స్‌ అయితే రూ.100 +జీఎస్‌టీ ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది.
    అలాగే ఎ.సి థియేటర్స్‌లో గరిష్ఠ ధర రూ.100 + జీఎస్‌టీ, నాన్‌ ఎ.సి. 70+ జీఎస్‌టీ, సింగిల్‌ థియేటర్‌ రిక్లైనర్‌ సీట్‌: 200+జీఎస్‌టీ, బిగ్‌ స్కీన్‌ అయితే రూ.250 +జీఎస్‌టీ, మల్టీప్లెక్స్‌ 250 +జీఎస్‌టీ, రిక్లైనర్‌ 300+జీఎస్‌టీ ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. ఎ.సి థియేటర్‌లో టికెట్‌కు నిర్వాహణ రుసుము రూ.5గానూ. నాన్‌ ఎ.సి థియేటర్‌లో రూ.3గానూ ఉండాలని తెలిపింది.

    టిక్కెట్ల ధరలు భారీగా పెరుగుతాయంటూ

    టిక్కెట్ల ధరలు భారీగా పెరుగుతాయంటూ

    కొత్త చార్జీలు అమల్లోకి వస్తే మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ఠ ధర రూ.250కి అదనంగా జీఎస్టీ, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వసూలు చేసే కన్వీనియెన్స్‌ రుసుము, నిర్వహణ చార్జీలు కలుస్తాయి. దీంతో టికెట్‌ ధర భారీగా పెరిగిపోతుంది. నేరుగా థియేటర్లలో టికెట్‌ కొంటే కన్వీనియెన్స్‌ రుసుము తగ్గుతుందిగానీ.. జీఎస్టీ, నిర్వహణ చార్జీల భారం అలాగే ఉంటుంది. దీంతో..ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో భిన్న వైఖరితో నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో ఎటువంటి స్పందనలు వస్తాయనేది వేచి చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+