వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కొత్తగా 13 మండలాలు - ఏ జిల్లాలొ ఎన్ని..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో పాలనా పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ లో ఉన్న రెవిన్యూ మండలాల సంఖ్య పెంచుతూ సీఎం సంతకాలు చేసారు. ఈ మేరకు మొత్తం తొమ్మది జిల్లాల్లో 13 మండలాలను కొత్తగా పెంచుతూ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసారు. నారాయణ పేట జిల్లా.. రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్ , కొత్తపల్లె మండలాలు ఏర్పాటయ్యాయి. ఇక, కొత్తగా • వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ మండలం ఏర్పాటైంది. మహబూబ్ నగర్ జిల్లా రెవిన్యూ డివిజన్ పరిధిలో..కౌకుంట్ల మండలం ఏర్పాట్లు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో పాటుగా..నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిథిలో..ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు ఏర్పాటయ్యాయి. జామాబాద్ జిల్లా, బోధన్ రెవిన్యూ డివిజన్ పరిథిలో, సాలూర మండలం ఏర్పాటు కానుంది. మహబూబాబాద్ జిల్లా..రెవిన్యూ డివిజన్ పరిథిలో..సీరోల్ మండలం ఏర్పాటైంది. నల్లగొండ జిల్లా..రెవిన్యూ డివిజన్ పరిథిలో...గట్టుప్పల్ మండలం కొత్తగా ఏర్పాటు కానుంది. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకర్గం పరిధిలోకి వస్తుంది. సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో...నిజాం పేట్ మండలం ఏర్పాటైంది.

Govt sanctioned 13 new mandals on administrative grounds, Orders issued

కామారెడ్డి జిల్లాలోని, బాన్స్ వాడ రెవిన్యూ డివిజన్ పరిథిలో.. డోంగ్లి మండలం కొత్తగా ఏర్పాటు చేస్తూ నిర్ణయించారు. ఇక, జగిత్యాల జిల్లా/జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిథిలో.. ఎండపల్లిమండలం...దీంతో పాటుగా జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిథిలో, భీమారం మండలం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రాజకీయంగా కొత్త సవాళ్లు..సమీకరణాల వేళ..ప్రభుత్వం పాలనా పరంగానూ నిర్ణయాల వేగం పెంచింది.

English summary
Telangana Govt issued GO on 13 mandals in nine districts, as pending demand from the public come to reality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X