Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూట‌మిది తాటాకు చ‌ప్పుడేనా..? గులాబీ పార్టీని సెంటిమెంటే మ‌ళ్లీ గెలిపిస్తుందా..!

హైద‌రాబాద్ : కేసీఆర్‌.. తెలంగాణ తెచ్చిన ఉద్య‌మ‌కారుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకున్నారు. ఆంధ్రోళ్ల‌పై నోరు పారేసుకోవ‌టం ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల్లో బావోద్వేగాల‌ను తారా స్థాయికి తీసుకురాగ‌లిగారు. అదే ఊపులో 2014లో విజ‌యం సాధించ‌గ‌లిగారు. అధికారం చేప‌ట్ట‌గానే చేసిన ప‌ని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌టం. త‌ద్వారా గులాబీ బ‌లాన్ని పెంచ‌ట‌మే ల‌క్ష్యంగా పావులు క‌దిపారు. త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్‌, మాగంటి వంటి టీడీపీ నేత‌ల‌ను పంచ‌న చేర్చుకున్నారు. హ‌స్తం పార్టీలో సీనియ‌ర్లు కేకే, డీఎస్, తాజాగా దానం నాగేంద‌ర్ ల‌కు కండువాక‌ప్పి కారులోకి ఎక్కించుకున్నారు.

 తెలంగాణ ప్ర‌జ‌లు విజ్ఞులు..! మ‌ళ్లీ సెంటిమెంట్ కే ఓటేస్తారంటున్న కేసీఆర్..!!

తెలంగాణ ప్ర‌జ‌లు విజ్ఞులు..! మ‌ళ్లీ సెంటిమెంట్ కే ఓటేస్తారంటున్న కేసీఆర్..!!

అయితే ఎన్నిక‌ల ముందు వ‌రంగ‌ల్‌కు చెందిన కొండా సురేఖ దంప‌తుల‌కు సీటు కేటాయించ‌క‌పోవ‌టం ద్వారా కీల‌క‌మైన నేత‌ల‌ను చేజార్చుకున్నారు. నిజామాబాద్‌లోనూ కూతురు ప్రాభ‌వానికి అడ్డువ‌స్తున్న డీఎస్ త‌న‌యుల‌పై కోపం.. డీఎస్‌ను పార్టీ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసేంత వ‌ర‌కూ చేరింది. చివ‌ర‌కు డీఎస్ వంటి సీనియ‌ర్ నేత అటు హ‌స్తం, ఇటు గులాబీ పార్టీకి కాకుండా మిగిలారు. అయినా ఇన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి వంద సీట్లు గెలువ‌గ‌ల‌మనే భ‌రోసాతో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఏకంగా 107 అసెంబ్లీ సీట్ల‌కు రెండు నెల‌ల ముందుగానే అభ్య‌ర్థులను ప్ర‌క‌టించి ప్ర‌తిప‌క్షాల‌కు స‌వాల్ విసిరారు. ఇదంతా కేసీఆర్ తాను గెల‌వ‌గ‌ల‌నే ఆత్మ‌విశ్వాసానికి నిద‌ర్శ‌న‌మంటూ పార్టీ శ్రేణులు ఆత్మ‌విశ్వాసం వెలిబుచ్చుతున్నాయి.

ప్ర‌తిప‌క్షాలను నిర్వీర్యం చేసిన టీఆర్ఎస్..! అదికారం మాదే అంటున్న గులాబీ నేత‌లు..!!

ప్ర‌తిప‌క్షాలను నిర్వీర్యం చేసిన టీఆర్ఎస్..! అదికారం మాదే అంటున్న గులాబీ నేత‌లు..!!

కానీ ప్ర‌చారానికి వెళ్లిన టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు బాల్క‌సుమ‌న్‌, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌, ఈటెల రాజేంద‌ర్‌, మాగంటి గోపీనాథ్, గాదెర కిషోర్ వంటి వారికి స్థానికుల నుంచి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. ఇటీవ‌ల జ‌రిపిన స‌ర్వేలోనూ గ్రామీణ ఓట‌రు గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, ప‌ట్ట‌ణ‌, న‌గ‌రాల్లోని ఓట‌ర్లు, నిరుద్యోగుల నుంచి వ్య‌తిరేక‌త త‌ప్ప‌దంటూ నిర్ద‌ర‌ణ‌కు వ‌చ్చారు. కానీ కేసీఆర్ మాత్రం.. ఇటీవ‌ల ఇండియాటుడే జ‌రిపిన స‌ర్వేలో 75 శాతం టీఆర్ ఎస్ గెలిచే అవ‌కాశాలున్నాయ‌నే తీపివార్త‌ను తెచ్చాయి. పైగా సెప్టెంబ‌రు త‌రువాత కేసీఆర్ ప్ర‌తిష్ఠ 3 శాతం పెరిగింద‌టూ ఆమోద‌ముద్ర వేసింది. మ‌రో స‌ర్వేలో కారు 70 సీట్లు గెలుచుకుంటుందంటూ తేల్చారు. హ‌స్తం, టీడీపీ కూట‌మి 60 సీట్లు సాధించి అధికారం చేప‌డుతుందంటూ మ‌రో స‌ర్వే సారాంశం.

 చంద్ర‌బాబు పై కేసీఆర్ మ‌రోసారి మాట‌ల దాడి..! ఈ సారి వ‌ర్కౌట్ అవుతుందా..?

చంద్ర‌బాబు పై కేసీఆర్ మ‌రోసారి మాట‌ల దాడి..! ఈ సారి వ‌ర్కౌట్ అవుతుందా..?

అయితే ఓట‌ర్లు ఏ పార్టీకు ఓటేయాల‌నే విష‌యం ముందుగానే ప‌సిగట్టి ఇదే నిజ‌మ‌నే భావ‌న‌కు రావ‌టం క‌ష్ట‌మంటూ ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్‌కిషోర్ అంటారు. పైగా ఎన్నిక‌ల 10-12 రోజులు ముందుగా త‌ట‌స్థ ఓట‌రు తుది నిర్ణ‌యానికి వ‌స్తారంటూ విశ్లేషించారు. ఈ లెక్క‌న కేసీఆర్‌, చంద్ర‌బాబు, ఉత్త‌మ్ ముగ్గురూ గెలుపుపై ఎవ‌రి భ‌యం వారిలో ఉన్న‌ట్లుగానే క‌నిపిస్తున్నారు. అయితే.. కేసీఆర్ మ‌రోసారి చంద్ర‌బాబునాయుడు, కాంగ్రెస్ ను తెలంగాణ ద్రోహులుగా చిత్రీక‌రించ‌టం.. ద్వారా సెంటిమెంట్‌ను ర‌గిలించాల‌ని చూస్తున్నారు. ఇటీవ‌ల హ‌రీష్‌రావు కూడా చంద్ర‌బాబును ఉద్దేశించి కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. ఇదంతా తెలంగాణ ప్రాజెక్టుల గురించి కావ‌ట‌మే ఇందుకు కార‌ణం. మ‌రోవైపు గులాబీ పార్టీను కాదంటే. మ‌ళ్లీ పెత్త‌నం ఆంధ్రావాళ్ల చేతిలోకి పోతుంద‌ని అమ‌రావ‌తి నుంచి పాల‌న సాగుతుందంటూ సెంటిమెంట్ ను ర‌గిలించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

టీఆర్ఎస్ వైపే తెలంగాణ ప్ర‌జ‌లు..! ప‌థ‌కాలే గెలిపిస్తాయంటున్న నాయ‌కులు..!!

టీఆర్ఎస్ వైపే తెలంగాణ ప్ర‌జ‌లు..! ప‌థ‌కాలే గెలిపిస్తాయంటున్న నాయ‌కులు..!!

కేసీఆర్ కూడా సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. కేసీఆర్ ఇచ్చిన హామీలు.. ద‌ళిత ముఖ్య‌మంత్రి, ద‌ళిత కుటుంబానికి మూడెక‌రాల భూమి ఇవ‌న్నీ అట‌కెక్కిన హామీలంటూ విప‌క్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. పైగా తెలంగాణ‌లోని 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో సీమాంధ్రుల ఓట్లు గెలుపును నిర్ణ‌యించ‌న్నాయి, ఇది త‌మ‌కు అనుకూల‌మంటూ కూట‌మి సంబ‌ర‌ప‌డిపోతుంది. 2014లో 119 స్థానాల్లో పోటీచేసి టీఆర్ ఎస్ 34.31 శాతం ఓట్ల‌తో 63 సీట్లు గెలుచుకుంది. హ‌స్తం పార్టీ 25.22శాతం ఓట్ల‌తో 21 సీట్లు, టీడీపీ 14.66 శాతం ఓట్ల‌తో 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచాయి. 2018లో కాంగ్రెస్‌, టీడీపీ క‌ల‌యిక‌తో 39.88శాతం ఓట్లు పోల‌వుతాయ‌నేది కూట‌మి ఆత్మ‌విశ్వాసం. ఎలాగూ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఓట్లు ఉంటాయి కాబ‌ట్టి మ‌హాకూట‌మిదే విజ‌యం అనేది ఉత్త‌మ్ చెబుతున్న మాట‌. కానీ వీట‌న్నంటినీ కేవ‌లం సెంటిమెంట్‌తో తెలంగాణ మాట‌తో మ‌రోసారి అధికారం చేప‌డ‌తానేది గులాబీబాస్ కేసీఆర్ స్ప‌ష్టం చేస్తున్న అంశం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+