వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా బతుకమ్మ సంబరాలు: సిరిమల్లెలో రామ రఘుమల్లెలో.. బతుకమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్భంగా సిరిమల్లెలో రామ రఘు మల్లెలో అంటూ రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఆవిష్కరించారు. ఈ సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

బతుకమ్మ గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

బతుకమ్మ గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో 2022 సంవత్సరం బతుకమ్మ గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జన్నారం జడ్పిటిసి ఎర్ర శేఖర్ బృందాన్ని అభినందించారు. ఇక ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపిక రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్ , టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు .

బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించనున్న తెలంగాణా ప్రభుత్వం

బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించనున్న తెలంగాణా ప్రభుత్వం

ఇదిలా ఉంటే గత మూడు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా ఘనంగా నిర్వహించలేకపోయిన బతుకమ్మ ఉత్సవాలను ఈ సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 25వ తేదీన ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభంకానున్న ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీన సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ క్రమంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై చేస్తున్న ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బి ఆర్ కే భవన్ లో ఇటీవల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గతేడాది కంటే రెండింతలు ఘనంగా ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలను నిర్వహించాలని సూచించారు.

బతుకమ్మ సంబరాల కోసం ఏర్పాట్లు చెయ్యాలన్న సీఎస్ సోమేశ్ కుమార్

ఇక బతుకమ్మ సంబరాల కోసం బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు వెంటనే నిర్వహించాలని సూచించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో, ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని సూచించారు. బతుకమ్మ పండుగకు హైదరాబాద్ మెట్రో పిల్లర్ లను చక్కగా అలంకరించాలని, పండుగ గురించి సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

బతుకమ్మకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తేవటంలో కవిత పాత్ర

ఇదిలా ఉంటే తెలంగాణ జాగృతి సాంస్కృతిక సంస్థ అధినేత్రి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. గత సంవత్సరం కవిత దుబాయ్ లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమైన బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో తెలిసేలా చేయడం కోసం, బతుకమ్మ పండుగ కు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించడం కోసం కల్వకుంట్ల కవిత విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకల విషయంలో ఆమె కీలక భూమిక పోషిస్తున్నారు.

English summary
The Telangana government will make all the arrangements to organize Bathukamma celebrations on a grand scale. As the Bathukamma celebrations begin from 25th of this month, MLC Kavitha released the Bathukamma song.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X