వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు ఎర్రబెల్లి, ఎన్టీఆర్‌భవన్లో రేవంత్: కేసీఆర్‌పై శపథం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డిని మే 31వ తేదీన ఏసీబీ అరెస్టు చేసింది. ఆయన జూన్ నెల మొత్తం జైలులోనే ఉన్నారు. అనంతరం జూలై 1న విడుదలయ్యారు. కుమార్తె నిశ్చితార్థం కోసం పన్నెండు గంటల పాటు గత నెల 11వ తేదీన బయటకు వచ్చారు.

చర్లపల్లి జైలు నుండి విడుదలైన రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆయనను పెద్ద ఎత్తున ర్యాలీగా జైలు నుండి ఎన్టీఆర్ భవన్‌కు తీసుకు వెళ్లారు. అక్కడ ఆయనను సన్మానించారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులతో తన నియోజకవర్గమైన కొడంగల్ వెళ్లనున్నారు.

బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ బాధల తెలంగాణగా మార్చారని, దొర కుట్రలు ఒక్కటొక్కటి బయటకు వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బుదవారం మండిపడ్డారు. నెల రోజులుగా తెలంగాణలో పరిపాలన లేదని, ఎవరి మెడకో ఉచ్చు తగిలించాలనే ధ్యాస తప్ప పాలనపై దృష్టి లేదన్నారు. రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ టీఆర్ఎస్‌లో చేరకుంటే నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చేది లేదని సీఎం బెదిరిస్తున్నారన్నారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ టీడీపీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం సాయంత్రం అమెరికాకు వెళ్లారు. ఆయన కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. దీంతో, పదిరోజుల పాటు అక్కడే ఉండేందుకు ఎర్రబెల్లి వెళ్లారని పార్టీ వర్గాలు చెప్పాయి.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

కేసీఆర్, ఆయన కుటుంబం, రాష్ట్ర మంత్రివర్గంపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. సిఎం తాగుబోతని, మంత్రులు సన్నాసులు, ఆలుగడ్డలు అమ్ముకునేటోళ్లంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

తనను 30 రోజులు జైలులో పెట్టిన కెసిఆర్, ఆయన కుటుంబంపై 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేస్తానని శపథం చేశారు.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

కేసీఆర్‌ను గద్దెదించడమే ఏకైక లక్ష్యమని రేవంత్ స్పష్టం చేశారు. తనకు బెయిలు రాగానే కేసీఆర్ లాగు తడిసిందని, ఇక టిఆర్‌ఎస్సోడు ఎవడైనా వాడి లాగుతడవాల్సిందేనని హెచ్చరించాడు. టీడీపీ నేతలు భుజాలపై మోసుకుంటూ బయటకు తీసుకురాగా రేవంత్ రెడ్డి మీసం తిప్పుతూ సవాల్ విసిరారు.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

అనంతరం నిప్పులు చెరిగారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నందుకే తనపై కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని, ఏసీబీ, పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించారని, 30 రోజులు జైలులో పెడితే రేవంత్ కథ ముగుస్తుందనుకుంటే అది కేసీఆర్ కలే అవుతుందన్నారు. జైలులో ఉండి కేసీఆర్ అక్రమాలు, కుంభకోణాల ఫైళ్లన్నీ చదివానని, ఇక కేసీఆర్.. నీ పని పడతానన్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

టీడీపీకి నేనున్నా.. కార్యకర్తలున్నారు.. తెలంగాణలో పార్టీ జెండాను ఎవడూ టచ్ చేయలేడని, కేసీఆర్ నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే.. నీది తెలంగాణ రక్తమే అయితే పార్టీలో చేర్చుకున్న సన్నాసులను తిరిగి పోటీ చేయించాలని సవాల్ చేశారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి


నీ కొడుకు నిజామాబాద్‌లో ఇసుక అక్రమంగా తరలించింది నిజం కాదా? అని దుయ్యబట్టారు. అలాగే రబ్బరు చెప్పులు కూడా లేకుండా, చిరిగిన లాగులేసుకుని నీ మామ ఇంట్లో తాగిపడేసిన చాయ్ కప్పులు తీసేటోడ్వి అంటూ హరీశ్ రావుపై మండిపడ్డారు.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ జాతిపిత (మహాత్ముడు) మందు ముట్టడని, కానీ కేసీఆర్ మాత్రం తాగకుండా ఉండలేడన్నారు.

English summary
Grand welcome to Revanth Reddy from TDP leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X