• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గొడవలొద్దు: కెసిఆర్ సిద్ధం కావాలన్న బాబు(పిక్చర్స్)

|

కరీంనగర్: తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకుంటూ సామరస్యంగా ముందుకు సాగుదామని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హితువు పలికారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన పార్టీ జిల్లా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు.

కొత్త రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు తాను సిద్ధమేనని, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సిద్ధం కావాలన్నారు. వనరుల పంపిణీ, ఇతరత్రా సమస్యలపై పదేపదే గిల్లికజ్జాలకు పోకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిద్దామన్నారు. భౌగోళికంగా రెండు రాష్ట్రాలు వేరైనా మానసికంగా తెలుగు ప్రజలు కలిసే ఉన్నందున, ఇరురాష్ట్రాలు అభివృద్ధే తన అభిమతమని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, ఇందుకు నిదర్శనం ప్రస్తుతం తెలంగాణలో ఏర్పాటైన అనేక పరిశ్రమలు, వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి కల్పనేన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ఆదినుంచి గౌరవించింది తెలుగుదేశం పార్టీయేనని, ఇక్కడి ప్రజల చిరకాలకాంక్షను గుర్తించే తమ పార్టీ కేంద్రానికి రెండుసార్లు లేఖ ఇచ్చిందని, అయితే కొంతమంది తనపై, తమపార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించారని మండిపడ్డారు.

నాగార్జునసాగర్ నీటివిడుదల విషయంలో జరిగిన జగడంలో తానే చొరవతీసుకుని కెసిఆర్‌తో మాట్లాడి, గవర్నర్ సమక్షంలో సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. తెలంగాణకు విద్యుత్ సరఫరా విషయంలో తనతో ఎప్పుడైనా సిఎం కెసిఆర్ మాట్లాడొచ్చని తెలిపారు. కార్యకర్త స్థాయి నుంచి నాయకులుగా మార్చిన టిడిపిని వీడిన కొంతమంది కేవలం పదవుల కోసమే పక్కదారి పట్టారని, కార్యకర్తలు మాత్రం ఏపార్టీలోకి మారలేదన్నారు. గతకొన్నేళ్ళుగా పార్టీనే నమ్ముకుని అభివృద్దికోసం అడుగులేస్తున్న కార్యకర్తలు అధికారపార్టీల ఒత్తిళ్ళు, బెదిరింపులకు వెరవకుండా పార్టీని గుండెల్లో పెట్టుకున్నారని ప్రశంసించారు.

బాబు సభ

బాబు సభ

తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకుంటూ సామరస్యంగా ముందుకు సాగుదామని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హితువు పలికారు.

చంద్రబాబు

చంద్రబాబు

మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన పార్టీ జిల్లా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు.

చంద్రబాబు

చంద్రబాబు

కొత్త రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు తాను సిద్ధమేనని, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సిద్ధం కావాలన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

వనరుల పంపిణీ, ఇతరత్రా సమస్యలపై పదేపదే గిల్లికజ్జాలకు పోకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిద్దామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

భౌగోళికంగా రెండు రాష్ట్రాలు వేరైనా మానసికంగా తెలుగు ప్రజలు కలిసే ఉన్నందున, ఇరురాష్ట్రాలు అభివృద్ధే తన అభిమతమని స్పష్టం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, ఇందుకు నిదర్శనం ప్రస్తుతం తెలంగాణలో ఏర్పాటైన అనేక పరిశ్రమలు, వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి కల్పనేన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణ ప్రజల మనోభావాలను ఆదినుంచి గౌరవించింది తెలుగుదేశం పార్టీయేనని, ఇక్కడి ప్రజల చిరకాలకాంక్షను గుర్తించే తమ పార్టీ కేంద్రానికి రెండుసార్లు లేఖ ఇచ్చిందని, అయితే కొంతమంది తనపై, తమపార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించారని మండిపడ్డారు.

చంద్రబాబు

చంద్రబాబు

విభజన జరిగితే వచ్చే ఇబ్బందులు తీర్చాలని మాత్రమే డిమాండ్ చేశానని గుర్తుచేశారు. నీటి సమస్య, ఫీజుల ఇబ్బందులతోపాటు మరెన్నో సమస్యలు సృష్టిస్తూ, వీటన్నిటికీ ఏపీ ముఖ్యమంత్రే కారణం, పరోక్షంగా టిటిడిపి నేతలేనంటూ తెరాస ఆరోపణలు చేయటం సమంజసం కాదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

అయితే, వాస్తవాలు మాత్రం ఇందుకు భిన్నమని, 52 శాతానికన్నా ఒక్కశాతం కూడా ఏపీ ఎక్కువ వినియోగించుకోలేదని స్పష్టం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఫీజు రీయంబర్స్‌మెంట్, విద్యుత్, సాగునీటి విషయంలో తాను ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనని పదేపదే ప్రకటించినా పట్టించుకోలేదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

నాగార్జునసాగర్ నీటివిడుదల విషయంలో జరిగిన జగడంలో తానే చొరవతీసుకుని కెసిఆర్‌తో మాట్లాడి, గవర్నర్ సమక్షంలో సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. తెలంగాణకు విద్యుత్ సరఫరా విషయంలో తనతో ఎప్పుడైనా సిఎం కెసిఆర్ మాట్లాడొచ్చని తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు

ఉమ్మడి రాష్ట్రంలో 9ఏళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ పాలనతోనే నేడు తెలంగాణకు మిగులు బడ్జెట్ లభించిందని, నాడు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. తాజాగా కొత్తరాష్ట్ర అభివృద్దికి బాటలు వేయబోతుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

టిడిపి అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజాపక్షమేనని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికోసం నిరంతరం పాటుపడుతుందన్నారు.

అలాంటి వారికి అండదండగా నేనున్నానని చెప్పేందుకే తాను జిల్లా ప్రతినిధుల సభకు వచ్చినట్లు ఊటంకించారు. ఇదే తీరును కార్యకర్తలు ఇకముందు కూడా కొనసాగిస్తే 2019లో తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించి, అధికారం చేపట్టడం ఖాయమన్నారు. తమపార్టీ అధికారంలోకొచ్చిన పిదప ట్యాంక్‌బండ్‌లో బుద్ధ విగ్రహం పక్కన తెలంగాణ అమరవీరుల భారీ స్థూపం టిటిడిపి నేతృత్వంలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

కాగా, బాబు ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు సభావేదిక వద్దకు దూసుకుపోయేందుకు యత్నిస్తూ, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన బాబు తెలుగుదేశం హాయాంలోనే దళితులకు న్యాయం జరిగిందని, ఎ,బి,సి,డి వర్గీకరణ కూడా చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలోనే తీర్మానం చేసి పంపామన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister and TDP president N. Chandrababu Naidu was accorded a warm welcome by the party rank and file on his maiden visit to Karimnagar on Tuesday after formation of separate Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more