ఓరుగల్లు వాసులకు శుభవార్త: 5వేల కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ లో కీలకఅడుగు!

గ్రేటర్ వరంగల్ ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు మరో కీలక అడుగుపడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మహా ప్రాజెక్టుకు రూ.5,257.20 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసిన నేపధ్యంలో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులలో వేగం పెరిగింది.

రాష్ట్ర రాజధాని తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే ఈ పథకంలో భాగంగా పనులకు సంబంధించి ఇప్పటికే సీడీఎంఏ డాక్టర్ టీకే. శ్రీదేవి జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.గ్రేటర్ వరంగల్ మహా నగరానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రాజెక్ట్ కు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సీడీఎంఏ డాక్టర్ టి.కే శ్రీదేవి అన్నారు.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి... వారిపై సీఎం రేవంత్ ఆగ్రహం, డెడ్ లైన్!
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి... వారిపై సీఎం రేవంత్ ఆగ్రహం, డెడ్ లైన్!
Greater Warangal underground drainage project gains momentum as CDMA directs officials to accelerate tender process

హైదరాబాద్ నుండి గ్రేటర్ వరంగల్ మహా నగరంలో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ సంబంధిత అంశాలు, టెండర్ ప్రక్రియ, పనులు చేపట్టే విధానంపై ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిఎంఏ డాక్టర్ టి.కే శ్రీదేవి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రూపొందించిన డీపీఆర్ కు సంబంధించి 15 రోజుల్లోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనుల వేగవంతానికి చర్యలు చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి టెండర్ల ఆహ్వానానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు సిడిఎమ్ఏకు వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు.

వరంగల్ విమానాశ్రయానికి మెజార్టీ ప్రజలు సూచించిన పేరు ఇదే!
వరంగల్ విమానాశ్రయానికి మెజార్టీ ప్రజలు సూచించిన పేరు ఇదే!

తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా, తొమ్మిది జోన్లు, పదమూడు సబ్‌జోన్లుగా విభజించి అమలు చేయనున్నారు. రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాలలోపు పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నగర జనాభా భవిష్యత్తు వృద్ధిని దృష్టిలో పెట్టుకుని మొత్తం 2,739 కిలోమీటర్ల పొడవైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నెట్‌వర్క్ నిర్మించనున్నారు.

ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు సంబంధించి రాజస్థాన్‌కు చెందిన ఎన్.కే. బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జీడబ్ల్యూఎంసీ అధికారుల సహకారంతో డీపీఆర్ సిద్ధం చేసింది. 2027 నాటికి నగరంలోని 2,92,194 ఇళ్లకు సీవరేజీ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం ప్రస్తుతం పనులను వేగవంతం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+