వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నా చెల్లెళ్ళ లవ్‌స్టోరీ: కాబోయే భర్త హత్య, ఏం జరిగిందంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. కాబోయే భర్తను ఫోన్ చేసి పిలిపించి ప్రియుడితో హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ నెల 21వ, తేదిన వివాహం జరగాల్సి ఉంది. అయితే వధువు ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో వరుడు తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు.

సభ్య సమాజం తలదించుకొనేలా ఓ యువతి వ్యవహరించింది. వావి వరుసలను మరిచింది. మరో యువకుడితో వివాహమై నిశ్చయమైంది. అయితే ఈ వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆ యువతి కాబోయే భర్తను ఫోన్ చేసి పిలిపించి ప్రియుడితో హత్య చేయించింది.

తన దగ్గరి బంధువుల అబ్బాయితో అరుణ ప్రేమలో ఉంది. అయితే ఈ విషయాన్ని దాచి పెట్టింది. యాకయ్యతో వివాహం అరుణకు ఇష్టం లేదు. అయితే వరుడిని తప్పించాలని కుట్ర పన్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యాకయ్య మృతి

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యాకయ్య మృతి

ఉమ్మడి వరంగల్ జిల్లా రఘునాథపల్లికి చెందిన యాకయ్యకు మరో అరుణకు ఈ నెల 21వ, తేదిన వివాహం జరగాల్సి ఉంది. అరుణ వరుసకు సోదరుడైన బాలస్వామితో ప్రేమలో పడింది. బాలస్వామి, అరుణ వివాహం చేసుకోవాలని భావించారు.కానీ, కుటుంబ సభ్యులు యాకయ్యతో వివాహం నిశ్చయించారు మరో వైపు యాకయ్యను వివాహం ఇష్టం లేని అరుణ, బాలస్వామిలు యాకయ్యను హత్య చేయాలని ప్లాన్ వేశారు. నాలుగు రోజుల క్రితం యాకయ్యను ప్లాన్ ప్రకారం తమ ఇంటి వద్దకు రప్పించిన అరుణ తన ప్రియుడు బాలస్వామి సహయంతో పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్రంగా గాయపడిన యాకయ్య గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న, మృతి చెందాడు.

అన్నా చెల్లెల మధ్య ప్రేమ

అన్నా చెల్లెల మధ్య ప్రేమ

అరుణ, బాలస్వామిలు కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. వారిద్దరి వరుసకు అన్నా చెల్లెలు. వావి వరుసలు మరిచిపోయారు. యాకయ్యతో వివాహన్ని ఆపేయాలంటే ఆయన్ను చంపాలని ప్లాన్ చేశారు. అయితే తమ చేతులకు మట్టి అంటకుండా ఉండాలని ప్లాన్ చేశారు. యాకయ్యను అరుణ్ పోన్ చేసి పిలిపించింది. అరుణ ఫోన్ చేయడంతో యాకయ్య అరుణ ఇంటి వద్దకు వచ్చి మరిచిపోయాడు.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ

వివాహం జరగాల్సిన రెండు రోజుల్లోనే యాకయ్యపై గుర్తు తెలియని దుండుగులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై పోలీసులు విచారణ చేశారు. యాకయ్యపై దాడికి ముందు ఆయన ఫోన్‌కు వచ్చిన ఫోన్ కాల్స్‌ ఆధారంగా విచారణ జరిపారు. ఈ ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులకు అరుణపై అనుమానం వచ్చింది. ఆమెను విచారిస్తే యాకయ్యపై దాడికి అసలు సూత్రధారి ఆమె అని తేలింది.

అరుణ, బాలస్వామి అరెస్ట్

అరుణ, బాలస్వామి అరెస్ట్

యాకయ్యపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసిన ఘటనలో పోలీసులు ఇప్పటికే అరుణ, బాలస్వామిని అరెస్ట్ చేశారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న,, మరణించాడు. అయితే యాకయ్య మృతితో రఘునాథపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయని పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.

English summary
Yakaiah died in Gandhi hospital at Hyderabad on Saturday morning. Bride Aruna key role behind murder plan of Yakaiah.police arrested Aruna and her lover Balaswamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X