Group-1 Mains: టీపీసీసీ అధ్యక్షుడితో గ్రూప్-1 అభ్యర్థుల భేటీ..!
జీవో నంబర్ 29 రద్దు చేసి గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని గ్రూప్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. బుధవారం రాత్రి అశోక్ నగర్ లో ధర్నాకు దిగారు. గురువారం రోజు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గ్రూప్-1 అభ్యర్థులను చర్చలకు పిలిచారు. దీంతో కొంత మంది గ్రూప్-1 అభ్యర్థుల బృందం మహేశ్ కుమార్ గౌడ్ తో సమావేశం అయ్యారు. తమ డిమాండ్లను వివరించారు. జీవో 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని కోరారు.పాత జీవో 55 ప్రకారం పరీక్షల జరపాలన్నారు.
పాత నోటిఫికేషన్లో ఇచ్చిన 503 పోస్ట్ లల కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. పెంచిన 60 పోస్టుల్లో మాత్రమే కొత్తగా అప్లై చేసుకున్న వారికి అవకాశం కల్పించాలన్నారు. జీవో 29, రిజర్వేషన్ల అంశాల్లో కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని పరిష్కరించి పరీక్షలు నిర్వహించాలని కోరారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరి ప్రకారం పరీక్షలు ఉండాలన్నారు. అభ్యర్థుల డిమాండ్లను మహేశ్ కుమార్ గౌడ్ విన్నారు. ఆయన దీనిపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది.

గ్రూప్-1 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అయితే వారని విడిచిపెట్టాలని మహేశ్ కుమార్ గౌడ్ పోలీసులను ఆదేశించారు. కొంత మంది గ్రూప్-1 అభ్యర్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. కాగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో గ్రూప్-1 మెయిన్స్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
బీఆర్ఎస్ హయాంలో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ కూడా జరిగాయి. అయితే పేపర్లు లీక్ కావడంతో గ్రూప్-1 రద్దు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరో 60 పోస్టులు పెంచి 563 పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 3.02 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 31,382 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో తీసుకున్నారు.












Click it and Unblock the Notifications