ఇంకా తగ్గిస్తే మీకే నష్టం: కెసిఆర్‌కు జైట్లీ షాక్, అమరావతిపై ఏపీకి లాభం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకు జీఎస్టీ భారం 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గుతుందన్న తెలంగాణ ప్రభుత్వ ఆశలపై జీఎస్టీ మండలి నీళ్లు పోసింది.

చదవండి: పవన్ కళ్యాణ్‌పై మళ్లీ: పవన్ పేరుందనే ఈ పోస్ట్.. మహేష్ కత్తికి 'సపోర్టర్' చురక

వర్క్స్‌ కాంట్రాక్టులపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చింది. పన్ను రేట్లను తగ్గించడం సరికాదని, దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికే నష్టమని స్పష్టం చేసింది.

చదవండి: చిరంజీవి అలా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు: టిడిపిలో చేరిన శోభారాణి, నాడు ఇలా..

మీరే లెక్కలు చూసుకోండి

మీరే లెక్కలు చూసుకోండి

ఇప్పటికే 18 శాతం ఉన్న పన్నును 12 శాతానికి తగ్గించామని, దీనిని 5 శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌ను అమలు చేస్తే నష్టపోతారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే లెక్కలు సరిచూసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, జీఎస్టీ మండలి అధ్యక్షుడు అరుణ్‌ జైట్లీ సూచించారు.

కెసిఆర్ అడిగారు.. కానీ ఆర్థికంగా నష్టం

కెసిఆర్ అడిగారు.. కానీ ఆర్థికంగా నష్టం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వర్క్‌ కాంట్రాక్ట్‌లపై జీఎస్టీ భారం తగ్గించాలని కోరారని జైట్లీ తెలిపారు. దీంతో 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించామని, వర్క్‌ కాంట్రాక్ట్‌లు అనేదానిపై మరింత వివరణ ఇస్తున్నామని, ప్రభుత్వ భవనాలకు దీన్ని వర్తింపచేస్తూ పూర్తి స్పష్టత ఇస్తున్నామని చెప్పారు. దీన్ని ఐదు శాతానికి తగ్గించాలని కోరుతున్నారని, అలా చేస్తే ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుందన్నారు.

తగ్గింపు కోసం పట్టు

తగ్గింపు కోసం పట్టు

వర్క్స్‌ కాంట్రాక్టులపై కేంద్రం మొదట 18 శాతం మేర జీఎస్టీని విధించింది. దీనిని పూర్తిగా ఎత్తేయాలని, లేదంటే ఇది వరకు ఉన్న ఐదు శాతం వ్యాట్‌ మేర అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. పబ్లిక్‌ వర్క్స్‌పై 18 శాతం జీఎస్టీతో రూ.19,200 కోట్ల ఆర్థిక భారం పడుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోడీకి, ఆర్థిక మంత్రి జైట్లీకి లేఖలు రాశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా పలు జీఎస్టీ మండలి సమావేశాల్లో దీనిని నివేదించారు.

ఆ తగ్గింపుతోను భారం

ఆ తగ్గింపుతోను భారం

ఆగస్టులో ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో 18 శాతాన్ని కాస్తా 12 శాతానికి తగ్గిస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. 12 శాతంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.9000 కోట్ల మేర భారం పడుతుందని, జీఎస్టీని మొత్తంగా ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. కనీసం ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులను పూర్తిగా మినహాయించాలని కోరింది.

అందుకే హైదరాబాదులో ఆతిథ్యం

అందుకే హైదరాబాదులో ఆతిథ్యం

అది సాధించుకొనే ఉద్దేశంతోనే ఈసారి హైదరాబాద్‌లో జీఎస్టీ మండలి సమావేశానికి ఆతిథ్యమిచ్చింది. అయితే, మండలి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆశలపై నీళ్లు చల్లింది. వర్క్స్‌ కాంట్రాక్టులపై 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీని తగ్గించడం గానీ, పూర్తిగా ఎత్తివేయడం గానీ సాధ్యం కాదని స్పష్టం చేసింది. 12 శాతమే అమలవుతుందని తేల్చి చెప్పింది.

ఏపీకి లాభం

ఏపీకి లాభం

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాజా జిస్టీ సమావేశం ఊరట అని అంటున్నారు. కాంట్రాక్టులపై జిఎస్టీని ప్రభుత్వం భరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిఎస్టీ తగ్గింపు వల్ల ఏపీ ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుందని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a partial success for the Telangana state government, the GST Council meeting, held in the city for the first time on Saturday, agreed to reduce the tax rate on work contracts to construct government buildings from 18 per cent to 12 per cent.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X