ప్రజాభవన్‌లో తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రానికి చెందిన గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం "తెలంగాణ గల్ఫ్‌, ఓవర్సీస్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డ్" ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గల్ఫ్‌ కార్మికుల సహాయార్థం ప్రజాభవన్‌లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. రైతుబీమా తరహాలో, గల్ఫ్‌ కార్మికులు చనిపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్‌ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గల్ఫ్‌ కార్మికులకు ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఉపాధి కోసం వెళ్లిన వారి వేతనాలు, బాగోగులు కూడా ప్రభుత్వం చూసుకోవాలని, కొన్ని దేశాలు, రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానంపై అధ్యయనం చేస్తున్నట్లు సీఎం రేవంత్‌ తెలిపారు.

gulf and overseas workers welfare board will be set-up in telangana CM Revanth Reddy

ఓవర్సీస్‌ కార్మికుల కోసం ఫిలిప్పీన్‌, కేరళలో మంచి విధానం ఉందని, అన్నీ అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వం కూడా సమగ్ర విధానం రూపొందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతుబీమా తరహాలో గల్ఫ్‌ కార్మికులు చనిపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిపారు.

గల్ఫ్‌ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. చట్టబద్ధమైన ఏజెంట్ల ద్వారా మాత్రమే కార్మికులకు వెళ్లేలా ఉండాలని స్పష్టం చేశారు. గల్ఫ్‌ కార్మికులకు వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చేలా వ్యవస్థ ఉండేలా చూస్తామని సీఎం రేవంత్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+