ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఫైరింగ్: తుపాకి పేలి ఎమ్మెల్యే డ్రైవర్ మృతి
హైదరాబాద్: భాగ్యనగరంలో మంగళవారం మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ చేతిలోని గన్ పేలడంతో ఆయన మృతి చెందాడు. ఆ డ్రైవర్ పేరు అక్బర్. ఇతను మహబూబ్ నగర్ జిల్లా వాసి.

ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం డ్రైవర్ అబ్బాస్ మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్. ఎమ్మెల్యే గన్‌మెన్ పౌచ్ సరిగా లేదని తన గన్‌ను పక్కన పెట్టాడు. దానిని డ్రైవర్ అబ్బాస్.. చూస్తానని తీసుకున్నాడు.
ఈ క్రమంలో హఠాత్తుగా గన్ పేలిందని తెలుస్తోంది. గన్ చేతిలోకి తీసుకున్నాక మిస్ ఫైర్ అయింది. దీంతో అబ్బాస్ అక్కడికి అక్కడే మృతి చెందాడు. అయితే, మిస్ ఫైర్ అయిందా లేక తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడా తెలియాల్సి ఉంది.
మిస్ ఫైర్ కావడం వల్లే చనిపోయాడు
గన్ మిస్ ఫైర్ కావడం వల్లే డ్రైవర్ అక్బర్ మృతి చెందాడని డిసిపి కమలాసన్ రెడ్డి వెల్లడించారు. అతని చాతిలోకి బుల్లెట్ దూసుకు పోయిందన్నారు. దీంతో అక్బర్ అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయాడన్నారు. సర్వీస్ రివాల్వర్ ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదన్నారు. గన్ మెన్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా గన్‌మెన్ రవీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications