గన్ మిస్‌ఫైర్ కావడంతో ఏపీ జవాను మృతి

సంగారెడ్డి: బీడీఎల్ భానూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీఐఎస్ఎఫ్ జవాను వెంకటేశ్(34) మృతి చెందారు. విధుల్లో ఉండగా బెటాలియన్ బస్సులో తుపాకీ పేలి తూటా తలలోకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

బస్సులో నుంచి కిందకు దిగుతున్న క్రమంలో వెంకటేశ్ వద్ద ఉన్న గన్ మిస్ ఫైర్ అయి ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా అవుకు మండలం జానూతల గ్రామానికి చెందిన వెంకటేశ్ హైదరాబాద్‌లోని సీఐఎస్ఎఫ్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

Gun misfire AP Jawan died in Sangareddy district

వెంకటేశ్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. 13 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరారు. వెంకటేశ్ మరణించడంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జవాను మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మహిళకు వేధింపులు: సీఐ సస్పెన్షన్

మహిళను వేధింపులకు గురిచేసిన హైదరాబాద్‌లోని సనత్‌​నగర్ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పురేందర్‌ రెడ్డిపై వేటు పడింది. పోలీస్ స్టేషన్​‌కు ఫిర్యాదు చేసిన మహిళ కేసులో సీఐ అసభ్యకరంగా మెసేజ్ చేశాడని సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతికి ఫిర్యాదు అందింది. సదరు మహిళ ఈ విషయంలో సీపీని కలిసి ఫిర్యాదు చేసింది.

సీఐ తనతో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను మహిళ సీపీకి చూపించింది. నువ్వు చాలా అందంగా ఉన్నావని, చెప్పిన చోటుకు రావాలని సీఐ ఆమెకు మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్​ చూసిన సీపీ అవినాష్‌ మహంతి ఇన్‌స్పెక్టర్‌ పురేందర్‌ రెడ్డిని కమిషనర్ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+