ప్రపంచ బ్యాంక్ లిస్ట్ ట్విస్ట్: ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకూ... గుత్తా మెలిక
హైదరాబాద్: పెట్టుబడులకు అవకాశంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో ఉండటంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. పెట్టుబడులకు అవకాశంగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ తొలిస్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు.మొదటి నుంచీ తాను ఏపీ బాగా అభివృద్ధి చెందిన ప్రాంతమనే వాదిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర ప్రాంతాల్లో పారిశ్రామిక వాతావరణం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 940 కిలోమీటర్ల పొడవున తీరప్రాంతం ఉందన్నారు. ఓడ రేవులు ఉన్నాయని చెప్పారు. అందుకే అక్కడకే పరిశ్రమలు ఎక్కువగా వస్తాయన్నారు. అందుకే, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే, తెలంగాణకు కూడా ఇవ్వాలని తాను కోరుతున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ సోమవారం నాడు భిక్షమెత్తి.. వచ్చిన డబ్బుతో ఓ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. నల్గొండ జిల్లా బూదాన్ పోచంపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నగేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని రాపోలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నగేష్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆయన జోలె పట్టి భిక్షాటన చేశారు. వసూలైన రూ.50వేల నగదును బాధిత కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి అందించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడకుండా భరోసా కల్పించాలన్నారు.












Click it and Unblock the Notifications