• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హాజీపూర్ బావిలో మొన్న శ్రావణి, నేడు మనిషా.. శవాల మీద శవాలు..! హత్యలు చేశానని అంగీకరించిన సైకో?

|

యాదాద్రి జిల్లా హజీపూర్ పదవ తరగతి అమ్మాయి శ్రావణి హత్యకేసు మరో మలుపు తిరిగింది. శ్రావణి మృతదేహాన్ని వెలికి తీస్తున్న పోలీసులకు బావిలో మరో శవం లభ్యం అయింది, దీంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ హత్య చేసిన నిందుతుడిని అరెస్ట్ చేసినప్పటికి , ఇలా జంట హత్యలు ఎందుకు చేశారు ? ఎం జరిగి ఉంటుందనేది అనేది పోలీసుల్లో ఉత్కంఠ రేపుతోంది. విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

హాజీపూర్ గ్రామంలో ఓకే బావిలో రెండు మృతదేహాలు

హాజీపూర్ గ్రామంలో ఓకే బావిలో రెండు మృతదేహాలు

యాదాద్రి భువనగిరి జిల్లా హజిపూర్ లోని భావిలో ఇద్దరు అమ్మాయిల మృతదేహలు లభ్యంకావడంతో గ్రామస్థుల్లో కలకలం రేగుతోంది. ఒక అమ్మాయి కోసం వెతికితే మరో అమ్మాయి శవం బయటపడడం ఆందోళనలను కల్గిస్తోంది. నాలుగు రోజుల క్రితం హజీపూర్ గ్రామానికి చెందిన పాముల నర్సింహ ,నాగమణిల కుమార్తే శ్రావణి , పదవ తరగతి చదువుతుండడంతో ప్రత్యేక క్లాసుల కోసం కీసర మండలంలోని సెరినిటి మోడల్ స్కూల్‌కు వెళ్లేది. ఈ క్రమంలోనే ఈనెల 25న కోచింగ్ కు వెళ్లిన శ్రావణి తిరిగి ఇంటికి రాలేదు . దీంతో ఆమే తల్లి దండ్రులు పోలీసులకు పిర్యాధు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు హత్య కారణమైన హజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డిగా గుర్తించారు. శ్రీనివాస రెడ్డిని గత నాలుగు రోజులుగా విచారిస్తుండడంతో శ్రావణిని హత్య చేసి, గ్రామంలోని బావిలో వేశానని తెలపడంతో పోలీసులు గత శుక్రవారం ఆమే శవాన్ని బావి నుండి వెలికి తీశారు.

బావిలో నుండి మరో శవం వెలికితీత

బావిలో నుండి మరో శవం వెలికితీత

కాగా నిందుతుడు శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులకు దిగ్బ్రాంతి కల్గించే అంశాలు వెలువడ్డాయి. శ్రీనివాస రెడ్డి శ్రావణితోపాటు మరో అమ్మాయిని సైతం హత్య చేసినట్టు విచారణ లో బాగంగా తెలిసింది. నెల రోజుల క్రితం అదృశ్యమైన మరో ఇంటర్ చదువుతున్న బాలిక మనిషా అనే అమ్మాయి మృతదేహాం బయటపడింది. మనిషా కూడ గత నెల క్రితమే అదృశ్యమైంది .అయితే మనిషా తల్లిదండ్రులు అమ్మాయి తప్పిపోయినా, బయట చెప్పకుండా వెతుకుతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ లో కూడ పిర్యాధు ఇవ్వలేదు. కాని అనుకోకుండా శ్రావణి అదృశ్యం పై విచారణ చేపడుతున్న పోలీసులకు అదే సమయంలో మనిషా హత్య బయటపడింది. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదం నెలకొంది. మరోవైపు ఇదే గ్రామంలో గత నాలుగు సంవత్సరాల క్రితం కల్పన అనే బాలిక సైతం అదృశ్యమైందని ఆమే ఆచూకి మాత్రం ఇంకా లభించలేదని చెబుతున్నారు. దీంతో పోలీసులు మరింత సిరియస్ గా హత్యలపై దృష్టి పెట్టారు.

హత్యలకు పాల్పడిన శ్రీనివాస రెడ్డి ఎవరు ,ఎందుకు హత్యలు చేశారు.

హత్యలకు పాల్పడిన శ్రీనివాస రెడ్డి ఎవరు ,ఎందుకు హత్యలు చేశారు.

హజీపూర్ గ్రామంలో శ్రీనివాస రెడ్డి హజీపూర్ గ్రామానికి చెందినవాడు. ఏసి మెకానిక్ గా పని చేస్తున్నాడు. అయితే శ్రీనివాస రెడ్డి ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని , ఇతనికి మత్తుమందు తీసుకునే అలవాట్లు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు శ్రీనివాస రెడ్డిపై హైదరాబాద్ , కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిందితున్ని ఎన్ కౌంటర్ చేయాలని గ్రామస్థుల డిమాండ్

నిందితున్ని ఎన్ కౌంటర్ చేయాలని గ్రామస్థుల డిమాండ్

కాగా తమ గ్రామంలోని వ్యక్తే హత్యచేయడంతో గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు . నిందితుడు శ్రీనివాస రెడ్డి ఆస్తులను భాదితులకు పంచుతామని, ఆయన్ని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గ్రామస్థులు దీక్ష చేపడతామని హెచ్చరించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతవరణ నెలకోంది. కాగా పోలీసులు విచారణలో మరిన్ని నిజాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇలా శ్రీనివాస్ రెడ్డి ఎంతమందిని చంపాడు , ఎందుకు ఎప్పుడు చంపాడనే అంశలు వెలుగులోకి రావాల్సి ఉంది.

English summary
Hajeepur murder case creates sensation, which is found dead body in the well, police arrested accused,and another body was found in the well
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X