మక్కా:14మంది భారతీయుల వివరాలు, హైదరాబాదీల పేర్లు లేవు, హెల్ప్‌లైన్(పిక్చర్స్)

మీనా/న్యూఢిల్లీ/హైదరాబాద్: మక్కాలో జరిగిన భారీ తొక్కిసలాటలో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ప్రాంతానికి చెందిన బీబీజాన్‌, చాంద్రాయణగుట్ట గాజిమిల్లత్‌ కాలనీకి చెందిన సబతస్లీం(52) అనే మహిళలు మృతిచెందారు. ఎల్బీనగర్‌ సమీప మన్సూరాబాద్‌ కాస్మోపాలిటన్‌ కాలనీలో నివసించే షేక్‌ అబ్దుల్‌ మాజిద్‌, బీబీజాన్‌(62) దంపతులు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా సింగరాయకొండ.

కాగా, చాంద్రాయణగుట్టకు చెందిన సబతస్లీం(52), భర్త మహ్మద్‌గౌస్‌తో కలిసి ప్రైవేటు ట్రావెల్స్‌ ద్వారా హజ్‌యాత్రకు వెళ్లారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. సౌదీలోనే ఉద్యోగం చేస్తున్న చిన్నకొడుకూ వీరితో కలిసి అక్కడి నుంచే యాత్రకు బయల్దేరాడు.

గురువారం జరిగిన తొక్కిసలాటలో ఆమె మృతిచెందినట్లు ఆమె భర్త కుటుంబసభ్యులకు తెలియజేశారు. కాగా, మక్కా మహా విషాదంలో 717 మంది మృతి చెందగా, 800మందికి పైగా గాయాలపాలైన విషయం తెలిసిందే.

మక్కా మృతుల వివరాలు: హెల్ప్‌లైన్ నెంబర్లు

హజ్‌యాత్రలో జరిగిన తొక్కిసలాటలో 14మంది భారతీయులు మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు. సౌదీలోని భారత ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం... 14మంది భారతీయులు మృతిచెందగా, మరో 13మంది గాయాలపాలయ్యారని సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు.

సౌదీ అధికారులు పూర్తిగా నిర్థారించిన తర్వాత మాత్రమే ఎంతమంది చనిపోయారనే విషయంపై స్పష్టత వస్తుందని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సౌదీలోని భారత హెల్ప్‌లైన్‌ నంబర్ల వివరాలను ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

హెల్ప్‌లైన్‌ నెంబర్లు: 00966 125458000, 00966 12549600, అరేబియా: 8002477786. ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం.. తొక్కిసలాటలో 14మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

14మంది మృతల వివరాలు: 1. షంషుద్దీన్‌ మహ్మద్‌ ఇబ్రహీం(తమిళనాడు), 2. మొహిద్దీన్‌ పిచాల్‌(తమిళనాడు), 3. నిజాల్‌ హఖ్‌(జార్ఖండ్‌), 4. మహ్మద్‌ రుస్తా అలి(జార్ఖండ్‌), 5. సలీమ్‌ యూసుఫ్‌ షేక్‌(మహారాష్ట్ర), 6. మహ్మద్‌ హనీఫ్‌ హసన్‌(గుజరాత్‌), 7. మహ్మద్‌ మదీనాబీబీ(గుజరాత్‌), 8. దివాన్‌ ఆయుబ్షా బఫైసా(గుజరాత్‌), 9. దివాన్‌ జుబేదా బీబీ ఆయుబ్షా(గుజరాత్‌), 10. సోడా రెహ్మత్‌ ఖ్వాసమ్‌(గుజరాత్‌), 11. బెటారా ఫాతిమాబెన్‌ కరీమ్‌(గుజరాత్‌), 12. బోలిమ్‌ హావ్‌బాయ్‌ ఇషాక్‌(గుజరాత్‌), 13. నగోరి జోహ్రాబీబీ( గుజరాత్‌), 14. నగోరి రుక్‌సానా మహ్మద్‌ ఇషాక్‌(గుజరాత్‌). వీరిలో హైదరాబాద్‌కి చెందిన వారి పేర్లు లేకపోవడం గమనార్హం.

మక్కా విషాదం

మక్కా విషాదం

మక్కాలో జరిగిన భారీ తొక్కిసలాటలో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ప్రాంతానికి చెందిన బీబీజాన్‌, చాంద్రాయణగుట్ట గాజిమిల్లత్‌ కాలనీకి చెందిన సబతస్లీం(52) అనే మహిళలు మృతిచెందారు.

బీబీజాన్(ఫైల్)

బీబీజాన్(ఫైల్)

ఎల్బీనగర్‌ సమీప మన్సూరాబాద్‌ కాస్మోపాలిటన్‌ కాలనీలో నివసించే షేక్‌ అబ్దుల్‌ మాజిద్‌, బీబీజాన్‌(62) దంపతులు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా సింగరాయకొండ.

మక్కా విషాదం

మక్కా విషాదం

పాతికేళ్లుగా నగరంలోనే ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు షేక్‌ అబ్దుల్‌ రియాద్‌, సిరాజుద్దీన్‌, సుజానీలు ఖతర్‌లో నివసిస్తున్నారు.

మక్కా విషాదం

మక్కా విషాదం

మక్కా మహా విషాదంలో 717 మంది మృతి చెందగా, 800మందికి పైగా గాయాలపాలైన విషయం తెలిసిందే.

మక్కా విషాదం

మక్కా విషాదం

హజ్‌యాత్రలో జరిగిన తొక్కిసలాటలో 14మంది భారతీయులు మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు.

మక్కా విషాదం

మక్కా విషాదం

సౌదీలోని భారత ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం... 14మంది భారతీయులు మృతిచెందగా, మరో 13మంది గాయాలపాలయ్యారని సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+