అంగరంగ వైభవంగా హనుమాన్ శోభయాత్ర ప్రారంభం (వీడియో)
హైద్రబాద్ లో హనుమాన్ శోభాయాత్ర గౌలి గూడ రామాలయం నుండి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. కాగ గౌలిగూడ నుండి ప్రారంభమైన యాత్ర తాడ్‌బండ్ లోని అంజనేయ స్వామి దేవాలయం వరకు సుమారు 12 కి.మీ మేర కొనసాగనుంది. గౌలినుండి కోఠీ, ఆశోక్‌నగర్ , కవాడీగూడ ల ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా తాడ్‌బండ్ వరకు శోభాయాత్ర చేరుకోనుంది.
ఈనేపథ్యంలోనే యాత్ర రాత్రి 8గంటల వరకు పూర్తవుతుందని పోలీసులు అంచనావేస్తున్నారు. యాత్రలో భాగంగా పోలీసులు ఎక్కడా ఎలాంటీ సంఘటనలు జరగకుండా భారీబందోబస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా నేడు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే శుక్రవారంతోపాటు గుడ్ ఫ్రైడే కూడ కావడంతో 450 సీసీ కేమేరాలతో కంట్రోల్ రూంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర#HanumanJayanti pic.twitter.com/eNJNdgSLAf
— Oneindia Telugu (@oneindiatelugu) April 19, 2019

మరోవైపు కేంద్రపారమిలటరీ దళాలు,ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లతో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు.ఇక శోభాయాత్ర జరుగుతున్న మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడ విధించారు.ఇందులో భాగంగానే పుత్లిభౌలి, చాదర్‌ఘాట్, నారాయణగూడ , ఆర్టీసీ క్రాస్‌రోడ్ మార్గల్లో వచ్చే వాహానాలు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications