గోదావరిఖనిలో దారుణం: లెక్చరర్ 'ప్రేమ' వేధింపులకు విద్యార్థిని బలి!
కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న చిట్యాల రోహిత్ అనే వ్యక్తి సౌమ్యను కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.
గోదావరిఖని: విద్యాబుద్దులు నేర్పించాల్సిన అధ్యాపకులే విద్యార్థులను ప్రేమ పేరుతో వేధిస్తున్న ఘటనలు ఈమధ్య కాలంలో చాలానే బయటపడుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో లెక్చరర్ ప్రేమ వేధింపులకు ఓ విద్యార్థిని అన్యాయంగా బలైపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో ఉన్న గౌతమి సాయి డిగ్రీ కళాశాలలో సౌమ్య అనే విద్యార్థిని ఇటీవలే మొదటి సంవత్సరం పూర్తి చేసింది. అయితే ఇదే కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న చిట్యాల రోహిత్ అనే వ్యక్తి సౌమ్యను కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.

ఇదే విషయం సౌమ్య ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ఇటీవల వేధింపులు మరింత ఎక్కువవడంతో సోమవారం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయ్ నగర్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడగా.. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో.. అక్కడినుంచి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ సౌమ్య మంగళవారం నాడు ప్రాణాలు విడిచింది. సౌమ్య మరణంతో లెక్చరర్ రోహిత్ ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications