మాది భగత్ సింగ్ పోరాటం-మీది ఉగ్రవాదం!: దాడిపై కాంగ్రెస్‌ను ఏకేసిన హరీశ్, ‘చర్యలు కఠినమే’

Subscribe to Oneindia Telugu
  కోమటిరెడ్డి హెడ్‌సెట్‌ విసురుతున్న దృశ్యాలు , సభ్యత్వం రద్దు?

  హైదరాబాద్: సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యుల తీరుపై అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయని, దాడి ఘటనను ఖండించాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఛైర్మన్ స్వామి గౌడ్‌పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అన్ని అధికారాలు స్పీకర్ ఉన్నాయని తెలిపారు.

  ఇంకెన్నాళ్లీ గూండాగిరీ, చర్యలు తప్పవు: కోమటిరెడ్డికి తలసాని హెచ్చరిక, 24గంటల పర్యవేక్షణ

  దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి పరిణామాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు హరీశ్ రావు తెలిపారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.

   జానా రెడ్డి సమర్థిస్తారా?.. అప్పటి పరిస్థితులు వేరే

  జానా రెడ్డి సమర్థిస్తారా?.. అప్పటి పరిస్థితులు వేరే

  కాంగ్రెస్ సభాపక్ష నేత జానా రెడ్డి సభలో కాంగ్రెస్ సభ్యులు జరిపిన దాడిని సమర్థిస్తారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో తాము గొడవ చేశామని, కానీ, అప్పుడున్న పరిస్థితులు వేరని అన్నారు. అప్పుడు తమకు మాట్లాడే అవకాశం లేదని, మైకు కూడా ఇవ్వలేదని చెప్పారు. పరాయి పాలనలో ప్రజల కోసం పోరాడమని, వారి గుండె చప్పుడును వినిపించామని తెలిపారు. అది తమకు జీవన్మరణ సమస్య అని చెప్పారు.

   ప్రజలపై అసహనంతోనే..

  ప్రజలపై అసహనంతోనే..

  కానీ, ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చామని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెబుతామని చెప్పినా వారు వినిపించుకోలేదని చెప్పారు. కాగితాలు విసిరేయడమే కాకుండా, హెడ్ విసిరి దాడులకు దిగారని అన్నారు. అధికారం దక్కకపోవడంతో తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ సభ్యులు అసహనంతో ఉన్నారని హరీశ్ ఆరోపించారు.

  మాది భగత్ సింగ్ లాంటి పోరాటం

  మాది భగత్ సింగ్ లాంటి పోరాటం

  బ్రిటీష్ పాలనలో పార్లమెంటుపై భగత్ సింగ్ పోరాటం చేశారని, కొద్ది రోజుల క్రితం కూడా పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని హరీశ్ అన్నారు. తమది భగత్ సింగ్ లాంటి పోరాటమైతే.. కాంగ్రెస్ వాళ్లది ఉగ్రవాదుల దాడిలాంటిదని చెప్పారు. తాము దేశ భక్తులమైతే.. కాంగ్రెస్ వాళ్లు దేశ ద్రోహులు అంటూ ధ్వజమెత్తారు.

   గూండాల్లా వ్యవహరించి..

  గూండాల్లా వ్యవహరించి..

  గవర్నర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని కాంగ్రెస్ వారే చెప్పుకోవడం దారుణమని అన్నారు. గవర్నర్‌ను లక్ష్యంగా చేసుకుంటే.. ఛైర్మన్ కంటికి హెడ్ సెట్ తగిలిందని కాంగ్రెస్ సభ్యులే మీడియాకు చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు సభలో గుండాల్లా వ్యవహరించారని మండిపడ్డారు.

   అందుకే మార్షల్స్ వచ్చారు..

  అందుకే మార్షల్స్ వచ్చారు..

  సభ ప్రారంభమైన మొదటి 5 నిమిషాలు సజావుగానే సాగిందని.. ఆ తర్వాతే కాంగ్రెస్ సభ్యులు వెల్‌‌‌లోకి దూసుకొచ్చి, గవర్నర్ పై దాడికి యత్నించారని అన్నారు. దీంతో మార్షల్స్ సభలోకి ప్రవేశించి గవర్నర్‌కు రక్షణ కవచంలా నిల్చున్నారని తెలిపారు. మాటల రూపంలో విమర్శలు ఉండాలి కానీ.. భౌతికంగా దాడులక తెగబడుతారా? అని హరీశ్ నిలదీశారు.

   చర్చకు సిద్ధమా?

  చర్చకు సిద్ధమా?

  రైతులకు తమ ప్రభుత్వం ఏం చేసిందో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో.. పక్కనే ఉన్న కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించేందుకు తాము సిద్ధమని హరీశ్ రావు అన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతుల కోసం ఏం చేస్తున్నామో ప్రజలకు తెలుసు అని అన్నారు.

   దేశానికి రోల్ మోడల్

  దేశానికి రోల్ మోడల్

  కాంగ్రెస్ వారికి.. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలుంటే మాటల రూపంలో తమకు చెప్పివుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రైతుల సమస్యలపై మొదటే చర్చిద్దామని కాంగ్రెస్ సభ్యులు కోరితే.. తాము అందుకు అంగీకరించేవాళ్లమని, అలా కాకుండా దాడులకు దిగడమేంటని హరీశ్ రావు ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ వారు అడగడంతో తాము రెండ్రోజులపాటు రైతు సమస్యలపై చర్చించామని చెప్పారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు అని, రైతుల కోసం ఈప్రభుత్వం చేస్తున్న పనులను దేశ మొత్తం గుర్తిస్తోందని చెప్పారు. దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ ఉందని హరీశ్ అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana minister Harish Rao fired at Congress and MLA Komatireddy Venkat Reddy for attacking chairman Swamy Goud in Assembly sessions.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి