హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ రాంగ్ గేమ్: రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ బంఫర్ ఆఫర్...!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన 'ఆకర్ష్' మంత్రాన్ని అన్ని పార్టీలకు చెందిన నేతలపైకి విసురుతోంది. ఆ పార్టీతో పోరుకు దిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపనేత, ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డిపై కూడా టీఆర్ఎస్ వల విసిరింది.

ఈ విషయాన్ని ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఆయా నేతల స్ధాయిని బట్టి వారికి సరితూగే నేతలను టీఆర్ఎస్ రంగంలోకి దించుతుండగా, రేవంత్ రెడ్డి కోసం తెలంగాణ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావే స్వయంగా రంగంలోకి దిగారట.

హరీశ్ రావు చేసిన ఆఫర్ ఏమిటి, తాను హరీశ్ రావుకు ఏం చెప్పానన్న విషయాలను వెల్లడించేందుకు మాత్రం రేవంత్ రెడ్డి నిరాకరించారు. ఇలాంటి విషయాలను బహిరంగంగా చర్చించడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు.

 Harish Rao offered me to Telangana Cabinet berth says Revanth reddy

అధికార పార్టీల నుంచి ఇలాంటి ఆఫర్లు సహజమేనని, బయట మాట్లాడితే సంస్కారం కాదనుకున్నానని రేవంత్ అన్నారు. ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నాను కాబట్టి.. ఇప్పుడా విషయాల వెల్లడి సబబు కాదని అన్నారు. అవకాశం దొరికినప్పుడు తప్పనిసరిగా ఈ విషయాలను బహిర్గతం చేస్తానని రేవంత్ చెప్పారు.

రేవంత్ మాట్లాడుతూ నాకు మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదని అన్నారు. మరోలా వస్తుందని అనుకున్నాను. తెలుగుదేశం పార్టీని వారు ఆంధ్రా పార్టీ అన్నారు. దానిపై నేను స్పందించి, ఆంధ్రా పార్టీ కాదు.. తెలంగాణ డెవలప్‌మెంట్‌ పార్టీ (టీడీపీ) అని చెప్పానని అన్నారు.

గతంలో ముఖ్యమంత్రుల మధ్య వైరుధ్యాలు.. వైషమ్యాలున్నా పార్టీ లేకుండా చేయాలని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కేసీఆర్‌దంతా విపరీత ధోరణి. మానసిక ఆందోళనతో, విపరీత మనస్తత్వంతో చేస్తున్న పనులుగా పేర్కొన్నారు. ఆట ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే కేసీఆర్‌ కూడా రాంగ్‌ గేమ్‌ మొదలుపెట్టారని చెప్పారు.

English summary
Harish Rao offered me to Telangana Cabinet berth says Revanth reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X