అపేది లేదు: చంద్రబాబుపై హరీష్ ఆగ్రహం, కోదండరాంకు పరోక్షంగా..

నిజామాబాద్: చంద్రబాబు నాయుడు వంటి వారు వందమంది బాబులు వచ్చినా మల్లన్న సాగర్, పాలమూరు ప్రాజెక్టులను ఆపలేరని, కచ్చితంగా నిర్మించి తీరుతామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు శుక్రవారం నాడు మండిపడ్డారు.

నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి పెద్ద చెరువులో మిషన్ కాకతీయ పనులను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్, టిడిపి, జేఏసీ నేతలు అడ్డుకుంటున్నారన్నారు. వారిని గ్రామాల్లోకి రానివ్వవద్దని హెచ్చరించారు.

జేఏసీ, కాంగ్రెస్, టిడిపి నేతలు గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టాలన్నారు. కాగా, మల్లన్న సాగర్ పైన టిడిపి, కాంగ్రెస్ పార్టీలతో పాటు జేఏసీ చైర్మన్ కోదండరామ్ కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Harish Rao says TDP and Congress conspiracy on projects

నాలుగు జిల్లాల్లో 1,100 గ్రామాల రైతులు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. చంద్రబాబు లాంటి వారు వంద మంది వచ్చినా ప్రాజెక్టులు కట్టి తీరుతామన్నారు.

మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి శిఖండి పాత్ర పోషిస్తున్నాయని కాంగ్రెస్, టిడిపి, జేఏసీల పైన మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ కావాలంటే కోటి ఎకరాలకు సాగునీరందించాలని చెప్పారు. జీవో 203ను ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకోవడం అమానుషమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+