మీడియా సహకారం కోరిన మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే మీడియా సహకారం అవసరం అని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం అన్నారు. ప్రభుత్వ లక్ష్యం, ఫలాలు ప్రజలకు చేరాలనేదే తమ ఉద్దేశ్యమని చెప్పారు.

జలసౌధలో నిర్వహించిన మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు జర్నలిస్టులకు అవార్డుల్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చెరువు మన బతుకుదెరువు అన్నారు. మిచిగాన్, చికాగో యూనివర్సిటీలను మిషన్ కాకతీయలో భాగస్వామ్యం చేసుకున్నామన్నారు.

Harish Rao seeks media help

అంతకుముందు, మీర్‌పేటలోని మంత్రాల చెరువు సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సుందరీకరణ పనులకు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రంలోని పలు చెరువులను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ తరహాలో మినీ ట్యాంక్‌బండ్‌లా సుందరీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: దత్తాత్రేయ

పేదలు, గిరిజనులు, అట్టడుగు వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన ఈఎస్‌ఐ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో పాల్గొన్నారు.

బస్తీల్లో ప్రజలు అంటు వ్యాధులకు గురికాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో విలువైన వైద్య పరికరాల కోసం కేంద్రం నుంచి నిధులు తేవడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ విషయమై కేంద్ర అధికారులతో మాట్లాడతానని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+