కేసీఆర్ ను టచ్ చేస్తే - హరీష్ హెచ్చరిక..!!
తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ కు నోటీసుల వ్యవహారం సంచలనంగా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ చేస్తోంది. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా ఆ సమయంలో కీలక హోదాల్లో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విచారణ చేసింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ ను సిట్ విచారించి వారి నుంచి సమాచారం సేకరణ చేసింది. కాగా.. ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం పైన బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు. సీఎం రేవంత్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణ సమయంగా నిర్దేశించింది. పోలీసు స్టేషన్ కు అవసరం లేదని.. ఎక్కడైనా విచారణ స్థలం ఖరారు చేస్తే అక్కడికే వస్తామని సిట్ టీం సమాచారం పంపింది. ఇప్పడు సిట్ సూచన పైన కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, కేసీఆర్ కు నోటీసుల పై మాజీ మంత్రి హరీష్ సీరియస్ అయ్యారు. కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడైన కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు.

బీఆర్ఎస్ నేతల సీరియస్
పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర, చౌకబారు రాజకీయాలకు రేవంత్ పరాకాష్ట అంటూ ఫైర్ అయ్యారు. దీనికి కొనసాగింపుగా రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడుగా రేవంత్ మిగిలి పోతారని వ్యాఖ్యానించారు. అధికారం, అహంకారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని హరీష్ సూచించారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉందని వెల్లడించారు. ఈ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని.. ప్రజలే తగిన బుద్ధి చెబుతారంటూ హరీశ్ రావు హెచ్చరించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications