రాష్ట్రాభివృద్ధికి గండి.. మాజీ మంత్రి హరీష్ రావు షాకింగ్ పోస్ట్!
తెలంగాణ రాష్ట్రం ఆపదలో ఉందని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి శూన్యంగా మారుతుందని బి ఆర్ ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పాలన పైన నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఒక్క సంవత్సరంలోనే వెనక్కి నెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ కొట్టారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తొందరపాటు నిర్ణయాలతో రాష్ట్ర వృద్ధికి చేటు
ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించిన హరీష్ రావు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం లో గణనీయమైన తగ్గుదల చోటు చేసుకుందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధికి చేటు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో తగ్గిన ఆదాయం
హరీష్ రావు చెప్పిన వివరాల ప్రకారం బీఆర్ఎస్ పాలనలో స్టాంపులు. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతి సంవత్సరం సగటున 25.62 శాతం వృద్ధి సాధించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2024 - 2025 సంవత్సరంలో ఈ శాఖ ఆదాయంలో 1.93 శాతం పడిపోవడం కనిపిస్తుందన్నారు. ఈ పరిస్థితి ఆపద్ధర్మంగా తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో రాష్ట్ర అభివృద్ధికి గండి పడిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను ప్రశ్నించిన హరీష్ రావు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను ప్రశ్నించిన హరీష్ రావు ప్రధానంగా హైడ్రా అంశాన్ని, మూసి రివర్ ఫ్రంట్ పేరుతో దుర్వినియోగ చర్యలను, మెట్రో రూట్ లలో అనవసరమైన మార్పులను ప్రశ్నించారు. అంతేకాదు ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేయడం వంటి అనేక అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిని నాశనం చేసే విధంగా హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారన్నారు.
The Telangana Stamps and Registration Department experienced remarkable growth under the BRS regime, posting a 25.62% annual average growth rate over 10 years (excluding the COVID-19 period). However, under @revanth_anumula leadership, the department recorded a 1.93% decline in… pic.twitter.com/OvklyXQlkX
— Harish Rao Thanneeru (@BRSHarish) April 6, 2025
పెట్టుబడిదారులకు హైదరాబాద్ పై విశ్వాసం పోయేలా నిర్ణయాలు
పేద, మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళను కూల్చివేయడం, ఇక మూసి రివర్ ఫ్రంట్ పేరుతో చేసినటువంటి దుర్వినియోగ చర్యలు ఇవన్నీ అభివృద్ధికి విఘాతం కలిగించాయని, ఉపాధి అవకాశాలు తగ్గిపోయేలా చేశాయని హరీష్ రావు పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు హైదరాబాద్ పై విశ్వాసం పోయేలా చేశాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి మార్గాన్ని ప్రదర్శిస్తుంది అన్న విషయం ఈ పరిణామాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి నిలబెట్టాలంటే ఇలా చెయ్యండి
రాష్ట్ర అభివృద్ధిని నిలబెట్టాలని భావిస్తే మౌలిక సదుపాయాల పైన దృష్టి సారించి స్పష్టమైన మార్గదర్శకత్వంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. తాము ప్రారంభించిన అభివృద్ధి ప్రణాళికలను పక్కనపెట్టి మంచి అవకాశాలను కోల్పోతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్న ప్రగతికి బాటలు వేయాలి అనే తీసుకోవలసి ఉంటుందని ఈ పోస్టు ద్వారా హరీష్ రావు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications